Advertisementt

అసురన్: నేషనల్ అవార్డ్ పక్కా అంట!

Mon 07th Oct 2019 02:21 PM
dhanush,fans,happy,asuran,movie,reports  అసురన్: నేషనల్ అవార్డ్ పక్కా అంట!
Positive Reports To Dhanush Asuran Movie అసురన్: నేషనల్ అవార్డ్ పక్కా అంట!
Advertisement
Ads by CJ

తమిళ నటుడు ధనుష్ తన కెరీర్ స్టార్టింగ్ నుండే విభిన్న చిత్రాలు చేస్తూ వచ్చాడు. ఈనేపధ్యంలో లేటెస్ట్ గా ధనుష్ వెట్రిమారన్‌ దర్శకత్వంలో అసురన్ అనే సినిమాతో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి ఆట నుండే పాజటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పుడుతున్నారు. వెక్కై అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

ఇందులో ధనుష్ 20 ఏళ్ల కుర్రాడికి తండ్రిగా, యువకుడిగా రెండు పాత్రల్లో నటించాడు.  ఇక ధనుష్ కి భార్యగా మలయాళ సీనియర్‌ నటి మంజువారియర్‌ నటిచింది. ఓ ఆసామి కారణంగా ప్రమాదంలో పడిన తన ఫ్యామిలీని శివస్వామి( ధనుష్ ) ఎలా కాపాడుకున్నాడు అనేదే సినిమా కథ.

ఈ సినిమాలో ధనుష్ నటన గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ పాత్రలకు నేషనల్‌ అవార్డు తప్పకుండా వస్తుందని కామెంట్ చేస్తున్నారు. జీవీ ప్రకాష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మరో హైలెట్. తెలుగులో ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. మరి తన ఫ్యాన్స్ భావిస్తున్నట్టుగా ధనుష్ కి నేషనల్ అవార్డు వస్తుందో రాదో చూడాలి.

Positive Reports To Dhanush Asuran Movie:

Dhanush Fans Happy with Asuran Movie Reports

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ