సిద్ధార్ధ, క్యాథరిన్ జంటగా సాయిశేఖర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం వదలడు. పారిజాత క్రియేషన్స్ పతాకంపై టి. అంజయ్య సమర్పణలో టి. నరేష్‌కుమార్, టి. శ్రీధర్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ రాజకీయ వేత్త మన్నే గోవర్ధన్ రెడ్డి ట్రైలర్‌ను ఆవిష్కరించారు. మరో ముఖ్య అతిధిగా ప్రముఖ నిర్మాత నట్టికుమార్ పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో...
మన్నే గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ... అంజయ్యగారు ఈ సంవత్సరంలో నాలుగు చిత్రాలు విడుదల చేశారు. తెలుగు ఇండస్ట్రీలో దిల్‌రాజు తర్వాత అంత పెద్ద ప్రొడ్యూసర్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఆయన ఎన్నో మంచి చిత్రాలు తియ్యాలని సినిమాలపై మక్కువ పెంచుకుని చెయ్యాలని కోరుకుంటున్నాను. హీరోయిన్ క్యాథరీన్ విషయానికి వస్తే సరైనోడు చిత్రంలో ఒరిజనల్ ఎంఎల్ఎ కంటే ఆమెకు ఎక్కువ పేరు వచ్చింది. అంత మంచి పాత్రలో ఆమె నటించారు. తెలంగాణలో అంజయ్యగారి లాంటి ఇంత మంచి ప్రొడ్యూసర్ తెలంగాణలో ఉండడం చాలా అనందంగా ఉంది. సిద్ధార్ధ తమిళ ప్రేక్షకులకు కొత్త గాని మన తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు అని అన్నారు.
నట్టికుమార్ మాట్లాడుతూ... ఈ సినిమా గురించి నేను చెప్పడం కాదు ఇది ఒక డిఫరెంట్ మూవీ. ఇప్పటివరకు క్యాథరిన్ చేసిన మూవీస్ అన్నీ సక్సెస్ సాధించాయి. ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుంది. ఈ బ్యానర్‌లో ఏ సినిమా చేసినా అన్నీ హిట్ అవుతున్నాయి. ఈ బ్యానర్ ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిల్‌రాజుగారు తర్వాత పారిజాత అంజయ్యగారు మంచి ప్రొడ్యూసర్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను అన్నారు.
ప్రొడ్యూసర్ శ్రీధర్ మాట్లాడుతూ... అనివార్య కారణాల వల్ల హీరో సిద్దార్ధతో పాటు మరికొంత మంది రాలేకపోయారు. కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. కల్తీ ఆహారాన్ని తీసుకోవడం వల్లే క్యాన్సర్ బారిన పడుతున్నారన్న కాన్సెప్ట్‌లో ఈ చిత్రం వస్తుంది. 450 థియేటర్లలో భారీగా విడుదల చేస్తున్నాము అన్నారు.
ప్రొడ్యూసర్ నరేష్ మాట్లాడుతూ... అక్టోబర్ 11న దాదాపు 400 థియేటర్లలలో ఈ చిత్రం విడుదలవుతుంది. టీమ్ అందరికీ కృతజ్ఞతలు అన్నారు.
క్యాథరిన్ థెరిస్సా మాట్లాడుతూ... ఇదే మొదటిసారి అనుకుంట ఒక సినిమా ఫంక్షన్‌కి హీరో, డైరెక్టర్ లేకుండా ప్రమోషన్ కోసం హీరోయిన్ మాత్రమే రావడం. వాళ్ళు వాళ్ళ పనుల వల్ల ఆగినా ఎవ్వరూ రాకపోయినా నేను సినిమా గురించి చెప్పడానికి వచ్చాను. తమన్ కూడా ఎక్కడో ఉన్నాడు ఆయన కూడా రావడానికి కుదరలేదు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు జ్యోతి. ఈ స్టోరీలో పాయింట్ నచ్చి ఒప్పుకున్నాను. క్వాలిటీ ఫుడ్ కాకుండా ఎందుకు డబ్బులు తీసుకుని ఇలాంటిది ఇస్తున్నారు అన్న కాన్సెప్ట్‌లో కథ ఉంటుంది అన్నారు.