Advertisementt

సందీప్ కిష‌న్ హీరోగా ‘A1 ఎక్స్‌ప్రెస్‌’

Mon 07th Oct 2019 01:43 PM
sundeep kishan,a1 express,movie details,dennis jeevan kanukolanu,pre look poster  సందీప్ కిష‌న్ హీరోగా ‘A1 ఎక్స్‌ప్రెస్‌’
Sundeep Kishan’s ‘A1 Express’ Film Announcement సందీప్ కిష‌న్ హీరోగా ‘A1 ఎక్స్‌ప్రెస్‌’
Advertisement
Ads by CJ

‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ చిత్రంతో సూప‌ర్‌హిట్ సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం ‘A1 ఎక్స్‌ప్రెస్‌’. న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ లుక్‌లో ఓ స్టేడియం ముందు సందీప్ కిష‌న్ చేతిలో హాకీ స్టిక్‌ను ప‌ట్టుకుని ఉన్నారు. హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్ర‌మిది.

ఈ చిత్రానికి డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హిప్ హాప్ త‌మిళ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ మొద‌టివారంలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2020లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు.

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను

నిర్మాత‌లు: టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం

స‌హనిర్మాత‌: వివేక్ కూచిభొట్ల

మ్యూజిక్‌: హిప్ హాప్ త‌మిళ‌

Sundeep Kishan’s ‘A1 Express’ Film Announcement:

Sundeep Kishan A1 Express Movie Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ