Advertisementt

‘సైరా’కు డబ్బులొస్తాయా?

Mon 07th Oct 2019 01:12 PM
sye raa,sye raa movie collections,sye raa narasimha reddy,chiranjeevi,distributors,ram charan  ‘సైరా’కు డబ్బులొస్తాయా?
Talk Hit.. But No Collections to Sye Raa ‘సైరా’కు డబ్బులొస్తాయా?
Advertisement
Ads by CJ

మెగాస్టార్ డ్రీం ప్రాజెక్ట్ సైరా న‌ర‌సింహారెడ్డికి ఎవరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ టాక్‌కి బలం చేకూరుస్తూ తొలిరోజు ఈసినిమాకి భారీ వసూళ్లు వచ్చాయి. సో ఇంక అంతా ఈ సినిమా కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుందని భావించారు ట్రేడ్ నిపుణులు. కానీ రెండో రోజు నుండి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. ఈసినిమా థియేట్రికల్ రైట్స్ 190 కోట్లుకి అమ్మారు. రెండో రోజు నుండి కలెక్షన్స్ డ్రాప్ అవ్వడంతో ఈసినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్న‌ది సందేహంగానే ఉంది.

తొలి మూడు రోజుల్లో ఈమూవీ వరల్డ్ వైడ్ గా రూ.74 కోట్ల షేర్ క‌లెక్ట్ చేసింది. ఇందులో మన తెలుగు రాష్ట్రాల నుండి 54 కోట్లు వరకు వచ్చాయి. ఇక మిగిలిన అన్ని ఏరియాస్ కలుపుకుని 20 కోట్లు వచ్చాయి. ఎట్టలేదన్న ఈమూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 125 కోట్లు కలెక్ట్ చేయాల్సి వస్తుంది. వీకెండ్ ముగిసేసరికి మ‌హా అయితే రూ.110 కోట్ల షేర్ మార్కును ట‌చ్ చేయొచ్చేమో కానీ అంతకు మించి కష్టమే అని అంటున్నారు ట్రేడ్ వాళ్లు. అంటే త‌ర్వాత రూ.80-90 కోట్ల షేర్ రాబ‌ట్ట‌డం అంటే మాట‌లా? సో ఈసినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా కష్టం అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో మరి?

Talk Hit.. But No Collections to Sye Raa:

Sye Raa Movie Collections Report

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ