Advertisementt

‘సైరా’ టీమ్ ‘వార్’ని లైట్‌గా తీసుకుందా..?

Sat 05th Oct 2019 05:22 PM
sye raa,underestimated,war,bollywood,box office  ‘సైరా’ టీమ్ ‘వార్’ని లైట్‌గా తీసుకుందా..?
Sye Raa team underestimated War ‘సైరా’ టీమ్ ‘వార్’ని లైట్‌గా తీసుకుందా..?
Advertisement
Ads by CJ

సాహో సినిమా ఆగష్టు 15 న విడుదల చేద్దామని డేట్ ఎనౌన్స్ చేసాక అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ సినిమా పోటీకి ఉండడంతో.. ఇంకా వేరే కారణాలతో సాహో సినిమాని సోలో డేట్ కి ఆగష్టు 30 న విడుదల చేసింది సాహో టీం. అందుకే సాహో సినిమాకి నెగెటివ్ టాక్ పడినా కూడా హిందీలో సాహో కలెక్షన్స్ బావున్నాయి. కానీ సైరా యూనిట్ మాత్రం బాలీవుడ్ వార్ సినిమాని బాగా లైట్ తీసుకుంది. ఎందుకంటే హ్రితిక్ రోషన్ ప్రస్తుతం అవుట్ డేటెడ్ హీరో, టైగర్ ష్రాఫ్ హీరో కాదు అందుకే వార్ కి పోటీగా సైరా సినిమా విడుదలైనా పెద్దగా ఇబ్బంది ఉండదు అని అనుకున్నారనిపించింది.

అందరూ సైరాకి వార్ పోటీ అన్నారు. కానీ సైరా టీం ఏం పట్టించుకోకుండా అనుకున్న టైంకి హడావిడి లేకుండా థియేటర్స్ లోకి వచ్చేసింది. సైరా సినిమాకి ఎంతగా హిట్ టాక్ వచ్చినా వార్ రూపంలో సైరా ఫస్ట్ డే ఓపెనింగ్స్ కి భారీ దెబ్బ పడింది. హిందీలో వార్ సినిమాకున్న క్రేజ్ సైరాకి లేకుండా పోయింది. క్రేజ్ ఉన్నప్పటికీ.. వార్ నిర్మాతలు తెలివి ముందు సైరా నిర్మాతలు ఓడిపోయారు. సైరా నిర్మాతలు వార్ నిర్మాతలతో మాట్లాడి సినిమా డేట్ మార్పించుకోవడమో... ఇంకేదైనా చేస్తేనో.. సైరా సినిమాకి కాస్త కలిసొచ్చేది. కాస్త కాదు సైరాకి ఇప్పుడొచ్చిన టాక్ కి హిందీలో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వచ్చేవి. మరి ఇప్పుడు వార్ తో పెట్టుకుని హిందీలో సైరా ఎలా నెగ్గుతుందో చూడాలి.

Sye Raa team underestimated War:

Sye Raa Vs War at Bollywood Box Office

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ