Advertisementt

బాలీవుడ్ ‘ఇస్మార్ట్ శంకర్’ ఇతనేనా?

Sat 05th Oct 2019 03:13 PM
ranbir kapoor,ismart shankar,remake,bollywood  బాలీవుడ్ ‘ఇస్మార్ట్ శంకర్’ ఇతనేనా?
Ismart Shankar Bollywood Remake Details బాలీవుడ్ ‘ఇస్మార్ట్ శంకర్’ ఇతనేనా?
Advertisement
Ads by CJ

బాహుబలి తరువాత మన తెలుగు సినిమాల రేంజ్ మారిపోయింది. అప్పటివరకు మన తెలుగు సినిమాల వైపు అసలు చూడని బాలీవుడ్ వాళ్ళు గత కొంత కాలం నుండి మన సౌత్ సినిమాలని తెగ కొంటున్నారు. ముఖ్యంగా మన తెలుగు సినిమాలని భారీ రేట్స్ కి కొంటున్నారు. ఆమధ్య డియ‌ర్ కామ్రేడ్ సినిమా రిలీజ్ కంటే ముందే దాని హ‌క్కులు క‌ర‌ణ్ జోహార్ కొనేసిన సంగ‌తి తెలిసిందే. దీనికంటే ముందు నాని జెర్సీ, RX 100 సినిమాల హ‌క్కులూ కొన్నారు.  రీమేక్ రైట్స్ అయితే కొంటున్నారు కానీ రీమేక్ చేయడం లేదు.

లేటెస్ట్ బాలీవుడ్ వాళ్ళు మరో సినిమా కొన్నారు. అదే పూరి - రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంక‌ర్. అయితే ఈ మూవీకు హిందీలో వినిపిస్తున్న హీరో పేరే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. చాక్లెట్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ర‌ణ‌బీర్ క‌పూర్ ఇస్మార్ట్ శంక‌ర్ రీమేక్‌లో న‌టిస్తాడ‌ట‌. మొదట రామ్ ని కూడా ఇంతే అనుకున్నారు. ఇప్పుడు రణబీర్ కపూర్ ని అనుకుంటున్నారు. అయితే హిందీ వర్షన్ కి డైరెక్టర్ ఎవరో ఇంకా క్లారిటీ లేదు. గత కొన్ని సినిమాల నుండి వ‌రుస ఫ్లాపుల‌తో అల్లాడిపోయిన ర‌ణ‌బీర్ కపూర్ కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిద్దాం. అసలు రణబీర్ కపూర్ ఈ రీమేక్ లో నటిస్తాడో లేదో... ఇందులో ఎంత నిజముందో తెలియాల్సిఉంది.

Ismart Shankar Bollywood Remake Details:

Ranbir Kapoor in Ismart Shankar Remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ