హరీష్ శంకర్ - వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన గద్దలకొండ గణేష్ (వాల్మీకి) చిత్రం హిట్ టాక్‌తో మంచి వసూళ్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా హిందీ డబ్బింగ్ విషయంలో కొనుగోలుదారుల నుంచి కోటిన్నర రూపాయలకు ఏదో నిబంధన ఉల్లంఘన నోటీసు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఇక్కడి మేకర్స్ యాభై లక్షలు ఇస్తాం అని చెబుతున్నారట కానీ వాళ్ళు ససేమీరా అంటున్నారని తెలుస్తుంది.
సో ఈ నేపథ్యంలో రానున్న భారీ సినిమాలు ‘సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో’ సినిమాల హిందీ డబ్బింగ్ అమ్మకాలు నిలిచిపోయాయి. బాలీవుడ్ వాళ్ళు తెలుగు సినిమాలని డైరెక్ట్‌గా కొని డబ్ చేయరు. మధ్యవర్తుల దగ్గరే కొని, తక్కువ ఖర్చులతో డబ్బింగ్ చెప్పించి యూట్యూబ్‌లో విడుదల చేస్తుంటారు. తెలుగు వాళ్ల సినిమాలను థియేటర్లలో చూడరు కానీ, యూట్యూబ్‌లో మాత్రం విచ్చలవిడిగా చూసేస్తుంటారు నార్త్ వాళ్లు. అందుకే ఈ బిజినెస్ అక్కడ బాగా పాపులర్ అయ్యింది. అయితే తెలుగు సినిమాల డబ్బింగ్ హక్కులు కొనే వాళ్లంతా ఒక సమూహంలా ఏర్పడి, ఇక్కడి నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. అనుకోకుండా వచ్చే ఆదాయం కావడంతో ఇక్కడి నిర్మాతలు వాళ్లు పెట్టే కండీషన్స్‌ని చూసిచూడనట్టు వదిలేసి సంతకాలు పెట్టడం వంటివి జరుగుతున్నాయి. ఇప్పుడదే వాల్మీకి నిర్మాతలు తలనొప్పిగా మారింది.
అందుకే ఇప్పుడు పెద్ద సినిమాలకి ఈ విషయంలో దెబ్బ పడుతుంది. అమ్ముదామన్నా, వారు కొంటామన్నా, కొనుగోలు దారులు పెట్టే కండిషన్లు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి అన్నది టాలీవుడ్ టాక్. అందుకే హిందీ డబ్బింగ్ హక్కుల అమ్మకానికి బ్రేక్ పడిపోయింది. మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.