సైరా సినిమా దసరా సెలవలు యూజ్ చేసుకోవడానికి ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి సినిమా. హిట్ టాక్‌తో థియేటర్స్‌లో దుమ్మురేపుతున్న సైరా సినిమాకి పోటీగా ఈ శనివారం గోపీచంద్ చాణక్య, నవీన్ - శ్రీనివాస్ అవసరాల ఊరంతా అనుకుంటున్నారు సినిమాలు థియేటర్స్‌లోకి వస్తున్నాయి. ‘సైరా’ సినిమా హిట్ అవడంతో చాణక్య, ఊరంతా అనుకుంటున్నారు టీం టెన్షన్ పడడమే కాదు.. చాణక్య సినిమాకైతే హైదరాబాద్‌లో కేవలం నాలుగు థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ చేసారంటే... థియేటర్స్ మొత్తం సైరాతో పాటుగా, బాలీవుడ్ మూవీ వార్ కూడా ఆక్యుపై చేసేశాయి.
మరి చాణక్య సినిమా మీద అంచనాలెలా ఉన్నప్పటికి.. ప్రస్తుతం ‘సైరా’ మ్యానియా నడవడంతో.. చాణక్య పరిస్థితి ఏం అర్ధం కావడం లేదు. అలాగే చాణక్య ప్రమోషన్స్ కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. మరో పక్క ఊరంతా అనుకుంటున్నారు సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్ప మరో ప్రమోషన్స్ లేవు. అయితే బుధవారం బాలీవుడ్ మూవీ వార్‌కి ఎక్కువ థియేటర్స్ కేటాయించారు. ఆ సినిమాకి హైదరాబాద్‌లో యావరేజ్ టాక్ పడడంతో.. ఇప్పుడు ఈ శనివారం నాటికి వార్ జోరు తగ్గితే గనక ఆ థియేటర్స్ లో కొన్ని గోపీచంద్ చాణక్యకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే ఆదివారం వరకు.. సైరా, వార్‌లు కాస్త పోటీగా నడిచే అవకాశాలున్నాయంటున్నారు. మరి ఈ రెండింటి మధ్యన చాణక్య నలిగిపోవడం ఖాయంగా కనబడుతుంది.