Advertisementt

ట్రైలర్ విడుదలైందని.. ‘ఎవ్వ‌రికీ చెప్పొద్దు’

Fri 04th Oct 2019 09:56 PM
evvarikee cheppodhu,movie,trailer,release  ట్రైలర్ విడుదలైందని.. ‘ఎవ్వ‌రికీ చెప్పొద్దు’
Evvarikee Cheppodhu Trailer Released ట్రైలర్ విడుదలైందని.. ‘ఎవ్వ‌రికీ చెప్పొద్దు’
Advertisement
Ads by CJ

ఆక‌ట్టుకుంటున్న ‘ఎవ్వ‌రికీ చెప్పొద్దు’ ట్రైల‌ర్‌.. అక్టోబ‌ర్ 8న సినిమా విడుద‌ల 

ఒక‌బ్బాయి, అమ్మాయి.. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌ అబ్బాయిని ఇష్ట‌ప‌డ్డ అమ్మాయి.. త‌న ప్రేమ‌ను మాత్రం అత‌నికి చెప్ప‌దు. అబ్బాయి ఫోన్ చేసినా తిడుతుంది.. చేయ‌క‌పోయినా తిడుతుంది. అయితే ప్రేమిస్తుంది. ఇద్ద‌రి మ‌ధ్య ఉండే అంత‌రం కులం.. మ‌రి ఈ అంతరాన్ని దాటి ఇద్ద‌రు ప్రేమికులు ఒక‌ట‌య్యారా?  లేదా? అనేది తెలుసుకోవాలంటే ‘ఎవ్వ‌రికీ చెప్పొద్దు’ సినిమా చూడాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్ స‌భ్యులు. 

క్రేజీ యాంట్స్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాకేశ్ వ‌ర్రె, గార్గేయి ఎల్లాప్రగ‌డ హీరో హీరోయిన్లుగా బ‌స‌వ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రాకేశ్ వ‌ర్రె నిర్మాణంలో రూపొందిన ల‌వ్‌స్టోరీ ‘ఎవ్వ‌రికీ చెప్పొద్దు’.  గురువారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ డిఫ‌రెంట్‌గా ఉందంటూ అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని  శ్రీ వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై దిల్‌రాజు తెలుగులో అక్టోబ‌ర్ 8న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా

హీరో, నిర్మాత రాకేశ్ వ‌ర్రె మాట్లాడుతూ - ‘‘హార్ట్ ట‌చింగ్ ల‌వ్ స్టోరీస్‌ను తెలుగు ప్రేక్ష‌కులు అద్భుతంగా ఆద‌రిస్తుంటారు. అలాంటి రొమాంటిక్ కామెడీ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకి వ‌స్తున్నాం. సినిమాకు సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. దిల్‌రాజుగారు మా సినిమాను అక్టోబ‌ర్ 8న‌ రిలీజ్ చేస్తున్నాం. ఆయ‌న అందిస్తున్న స‌హ‌కారానికి ఆయ‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌. ట్రైల‌ర్ చూసిన వాళ్లంద‌రూ బావుంద‌ని అంటున్నారు. సినిమా త‌ప్పకుండా అంద‌రికీ న‌చ్చుతుంది’’ అన్నారు.

న‌టీన‌టులు:

రాకేశ్ వ‌ర్రె

గార్గేయి ఎల్లాప్ర‌గ‌డ‌

సాంకేతిక నిపుణులు:

ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: బ‌స‌వ శంక‌ర్‌

నిర్మాత‌:  రాకేశ్ వ‌ర్రె

రిలీజ్‌:  శ్రీ వెంక‌టేశ్వ‌ర ఫిలింస్‌

కెమెరా:  విజ‌య్ జె.ఆనంద్‌

సంగీతం:  శంక‌ర్ శ‌ర్మ‌

ఎడిట‌ర్స్‌: బ‌స‌వ శంక‌ర్‌, తేజ యర్రంశెట్టి, స‌త్య‌జిత్ సుగ్గు

సౌండ్ డిజైన్‌:  సింక్ సినిమా

పాట‌లు:  వాసు వ‌ల‌బోజు

కాస్ట్యూమ్స్‌: అమృత బొమ్మి

ఆర్ట్‌: ల‌క్ష్మి సింధూజా గ్రంధి

పి.ఆర్‌.ఒ:  వంశీ కాక‌

లైన్ ప్రొడ్యూస‌ర్‌:  కేత‌న్ కుమార్

క‌ల‌రిస్ట్‌:  వివేకానంద్‌

ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: అనంత్‌( ప‌ద్మ శ్రీ యాడ్స్‌)

ప్రొడ‌క్ష‌న్ హౌస్‌:  క్రేజీ యాంట్స్ ప్రొడ‌క్ష‌న్స్

Evvarikee Cheppodhu Trailer Released:

Evvarikee Cheppodhu Movie Release Date Fixed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ