Advertisementt

టాక్ బాగున్నా.. ‘సైరా’ పరిస్థితి అక్కడ ఘోరం!

Fri 04th Oct 2019 08:24 PM
sye raa,bollywood,talk,blockbuster,no collections  టాక్ బాగున్నా.. ‘సైరా’ పరిస్థితి అక్కడ ఘోరం!
Sye Raa got Hit Talk.. But No Collections టాక్ బాగున్నా.. ‘సైరా’ పరిస్థితి అక్కడ ఘోరం!
Advertisement
Ads by CJ

సైరా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలోను హిట్ టాక్ తో వీర విహారం చేస్తుంది. ఇక తమిళం, కన్నడ, మలయాళంలోనూ సైరా సినిమా దూసుకుపోతుంటే... హిందీలో మాత్రం ఫస్ట్ డే సైరాకి దెబ్బపడినట్లే అనిపిస్తుంది. మొదటి నుండి సైరాకి వార్ సినిమా పోటీ అన్నారు. అన్నట్టుగానే బాలీవుడ్ లో మాత్రం వార్ సినిమా సైరా మీద పెత్తనం చేసింది. యశ్ రాజ్ ఫ్లిల్మ్స్ వారు సైరాకి థియేటర్స్ దొరక్కుండా.. వార్ కి ఎక్కువ థియేటర్స్ బ్లాక్ చెయ్యడంతో సైరా సినిమా చాలా తక్కువ థియేటర్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

దానితో సైరా సినిమాకి హిందీలో మొదటిరోజు చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ పడలేదు. సైరా పరిస్థితి హిందీలో కాస్త దారుణంగానే కనబడుతుంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ సినిమాకి అక్కడ  50కోట్లకు పైగా గ్రాస్ సాధిస్తే.. సైరా కేవలం 2 కోట్ల షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సైరా నరసింహారెడ్డికి అంతగా హిట్ టాక్ వచ్చినా... కావాల్సినన్ని థియేటర్స్ సైరాకి లేకపోవడంతో సైరా కలెక్షన్స్ మీద ఆ ప్రభావం పడింది. ఇక హాలీవుడ్ మూవీ జోకర్ కూడా 6 కోట్ల షేర్ సాధించింది అంటే.... అక్కడ సైరా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుస్తుంది.

Sye Raa got Hit Talk.. But No Collections:

Sye Raa Bollywood Talk: BlockBuster but no Collections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ