కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్న జయలలిత బయోపిక్‌లో అరవిందస్వామి
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో జయలలితగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తుంది. ఈ చిత్రంలో ఎం.జి.ఆర్(మరుతూర్ గోపాల రామచంద్రన్) పాత్రలో ప్రముఖ నటుడు అరవింద స్వామి నటిస్తున్నారు. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి ప్రారంభం కానుంది.
విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు రచయితగా పనిచేస్తున్నారు. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విష్ణు ఇందూరి, శైలేష్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నటీనటులు: కంగనా రనౌత్, అరవింద స్వామి
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: ఎ.ఎల్.విజయ్
నిర్మాతలు: విష్ణు ఇందూరి, శైలేష్ సింగ్
రచయిత: విజయేంద్ర ప్రసాద్