ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ నిన్న ప్రేక్షకులు ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్‌ని షాక్ చేస్తుంది. మొదట షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఈసినిమా రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. అలానే మరో పక్కన తమన్నా ఫ్యాన్స్‌తో పాటు తమన్నా కూడా ఈసినిమా విషయంలో చాలా సంతోషంగా ఉంది.
సైరాలో ఆమె పాత్ర గురించే అంత మాట్లాడుకుంటున్నారు. రిలీజ్‌కి ముందు వరకు సైరాలో ఆమెది చిన్న పాత్ర అనుకున్నారు. కానీ సినిమాలో తమన్నాకు బాగా సీన్ ఇచ్చారు. పైగా నయనతార లాంటి లేడీ సూపర్ స్టార్‌తో కలిసి నటించినప్పటికీ తమన్నాకే పేరు వచ్చింది. నయన్ కన్నా తమన్నా పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కడంతో పాటు ఆమెకు క్లైమాక్స్ లో మంచి సీన్స్ పడ్డాయని సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్‌లో సినిమాలు లేని తరుణంలో ఆమెకు సైరా రిజల్ట్‌తో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశముంది. కచ్చితంగా సైరా తరువాత ఆమె కెరీర్ మరికొంత కాలం సాగేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అల్రెడీ ఈ భామ తెలుగులో ఓ అవకాశాన్ని అందిపుచ్చుకుంది కూడా. సంపత్ నంది చేయబోతున్న తదుపరి చిత్రంలో హీరోయిన్ ఈ మిల్కీ బ్యూటీనే.