Advertisementt

జబర్దస్త్ షో నుంచి వారు తప్పుకున్నారట!

Thu 03rd Oct 2019 07:12 PM
jabardasth show,creative heads,out,nagababu  జబర్దస్త్ షో నుంచి వారు తప్పుకున్నారట!
They Are Out From Jabardasth Show జబర్దస్త్ షో నుంచి వారు తప్పుకున్నారట!
Advertisement
Ads by CJ

ప్రతి గురువారం, శుక్రవారం ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో వేరే చెప్పనవసరం లేదు. ఈ రెండు రోజులకి వచ్చిన టీఆర్పీ రేటింగ్స్ మరే ప్రోగ్రాం కి రావు. అంతలా క్లిక్ అయినా ఈ షో నుండి కీలకమైన క్రియేటివ్ హెడ్స్ నితిన్-భరత్ ఆ కార్యక్రమం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలానే పోరా పోవే కొనసాగింపు విషయంలో మల్లెమాల యూనిట్‌తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్స్‌ల కారణంగా వారిద్దరూ ఈటీవీ నుండి తప్పుకున్నారు.

మరో వైపు జబర్దస్త్ హోస్ట్ నాగబాబు ఈ షో పై ప్రత్యేకమైన శ్రద్ద పెట్టినట్టు తెలుస్తుంది. జబర్దస్త్ లో బాగా లావుగా వున్న ఇద్దరు ముగ్గురు నటులకు అర్జెంట్ వెయిట్ లాస్ కావాలని...అలా వాళ్ళు లావు తగ్గితే యాభై వేలు గిఫ్ట్ ఇస్తానని నాగబాబు ఆఫర్ పెట్టాడట. ఈ షో స్కిట్ లు, వాటి క్వాలిటీ, నటుల ఫిజిక్ ఇవన్నీ కూడా ఇప్పుడు బేరీజు వేస్తూ, జబర్దస్త్ స్థాయిని పెంచే దిశగా నాగబాబు ప్రయత్నిస్తున్నారట. కానీ నితిన్-భరత్ లు సడన్ గా ఆ కార్యక్రమం నుండి తప్పుకోవడంతో ఇప్పుడు షో ఎలా రన్ చేస్తారో చూడాలి.

They Are Out From Jabardasth Show:

Jabardasth Creative Heads Out From the Show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ