చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలు మధ్యన భారీగా విడుదలైన సై రా సినిమా మీద ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. మెగాస్టార్ చిరు సినిమా కావడం అందులో నయనతార, అమితాబచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా లాంటి స్టార్స్ ఉండడంతో.. సైరా మీద ప్రేక్షకుల్లో పిచ్చ క్రేజ్ ఏర్పడింది. ఇక ఇప్పటికే పూర్తయిన యుఎస్ ప్రీమియర్స్ టాక్ ద్వారా సినిమా.. బావుందని, మెగాస్టార్ చిరు, సైరా నరసింహారెడ్డిగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని, గోసాయి వెంకన్నగా నరసింహారెడ్డి గురువు పాత్రలో అమితాబ్ పర్ఫెక్ట్ గా సెట్టయ్యారని టాక్. అలాగే మెగాస్టార్ మరియు నయనతారల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు సూపర్ అని, ఆ ఎమోషనల్ సన్నివేశాల్లో నయనతార నటన అదుర్స్ అంటున్నారు. తమన్నా కూడా తన నటనతో ఆకట్టుకుందని... సైరా పాత్రలో మెగాస్టార్ ని తప్ప మరెవరిని వూహించలేమంటున్నారు.
ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి కి ఏమాత్రం టచ్ లేని సబ్జెక్టు తో సినిమా తీసినా.. సై రా సినిమాని అద్భుతంగా తెరకెక్కించారని, అయితే సినిమా ఫస్ట్ హాఫ్ కథనం అక్కడక్కడా కాస్త నెమ్మదిగా మొదలవుతున్నట్టు అనిపించినా... ఇంటర్వెల్ వచ్చేసరికి మెగాస్టార్ కు ఎలాంటి ఎలివేషన్లు ఇస్తే మాస్ ఆడియన్స్ మరింతగా కనెక్ట్ అవుతారో అలాంటి ఎలివేషన్స్ తో సినిమాని లేపారంటున్నారు.
ఇక సినిమాకి నిర్మాణ విలువలతో పాటుగా, సినిమాటోగ్రఫీ అద్భుతమని, అమిత్ త్రివేది అందించిన పాటలు ఒక్క టైటిల్ ట్రాక్ బావున్నప్పటికీ... మిగతా పాటలు పర్వాలేదనిపిస్తాయి. కానీ జూలియస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీక్వెన్సెస్ లో సూపరని అంటున్నారు. కాకపోతే సినిమా ఫస్ట్ హాఫ్ స్లో గా ఉండడం, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం మైనస్‌లుగా చెబుతున్నారు.