చాలా తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరో పక్కన చేసే ఛాన్స్ కొట్టేసింది కన్నడ బ్యూటీ రష్మిక. మొదట రెండు సినిమాలతో తన ఫేట్ మారింది. ఛలోతో పాటు గీత గోవిందం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తనకు అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి. అలా మహేష్ బాబు పక్కన ఛాన్స్ వచ్చింది. మహేష్ తో సినిమా అని సంబరపడిపోతుంది కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ పక్కా కమర్షియల్ సినిమా. ఇందులో హీరోని హైలెట్ చేసే సీన్స్ మాత్రమే ఉంటాయి. హీరోయిన్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. సో ఈ సినిమాలో రష్మికకి ఏమాత్రం ప్రాధాన్యం ఉంటుందో అన్న సందేహాలున్నాయి.
అసలే మన అమ్మడుకి టాలెంట్ తక్కువ లక్ ఎక్కువ. ఇటువంటి టైంలోనే రష్మిక పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్ అయితేనే హైలెట్ అవుతుంది. పైగా రష్మిక గ్లామర్ విషయంలో వెనుకంజే. పైగా డాన్సులు కూడా పెద్దగా వచ్చేలా కనిపించడం లేదు. అందుకేనేమో ఈ సినిమాలో స్పెషల్ సాంగ్స్ కోసం గ్లామర్ హీరోయిన్లను తీసుకునే ప్రయత్నంలో పడ్డాడు అనిల్. పూజా హెగ్డే, తమన్నా ఇందులో స్పెషల్ సాంగ్స్ తో ఎంటర్టైన్ చేయనున్నారు. సో ఇలా రష్మిక పూర్తిగా డమ్మీ అయిపోవడం ఖాయం. ఈ సినిమా చేయడం వల్ల రష్మికకు ఏమి లాభం లేదు ఒక్కటి తప్ప. సినిమా హిట్ అయితే ఈమె ఖాతాలో హిట్ చేరుతుంది అంతే.