Advertisementt

‘నేనున్నాను’ గ్రంధాన్ని స్వీకరించిన సంజయ్ దత్

Wed 02nd Oct 2019 10:22 AM
nenunnanu,bollywood hero,sanjay dutt,puranapanda srinivas  ‘నేనున్నాను’ గ్రంధాన్ని స్వీకరించిన సంజయ్ దత్
Sanjay Dutt Happy with Puranapanda Srinivas Nenunnanu ‘నేనున్నాను’ గ్రంధాన్ని స్వీకరించిన సంజయ్ దత్
Advertisement
Ads by CJ

అనంతరూపాలతో, అనంత బాహువులతో  మహా స్వరూపంగా ఈ లోకాన్ని సంరక్షిస్తున్న ఆంజనేయ భగవానునిపై ఈ దేశంలో తొలిసారిగా ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనంగా అమోఘ రీతిలో వెలువరించిన ఉపాస్య విశేష సంచిక ‘నేనున్నాను’ అద్భుత ఉపాస్య గ్రంథం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పీఠాధిపతులు, మఠాధిపతులు, మేధావి వర్గంతో పాటు ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల్ని సైతం విశేషంగా ఆకర్షిస్తోంది.

ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ నుంచి ఈ ‘నేనున్నాను’ గ్రంథాన్ని స్వీకరించిన బాలీవుడ్ కథానాయకుడు సంజయ్ దత్ తన ఆరాధ్య దైవం ఆంజనేయునిపై ఇంతటి గ్రంధాన్ని అందుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని, భాష రాకున్నా ఈ మహా గ్రంథాన్ని తన పూజా మందిరంలో పూజ్య స్థానంలో ఉంచుతానని చెప్పారు. పురాణపండ శ్రీనివాస్‌కి ఈ సందర్భగా ధన్యవాదాలు తెలిపారు.

టాలీవుడ్ అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, దర్శకధీరుడు రాజమౌళి, ప్రముఖ సంగీత దర్శకులు ఎస్.ఎస్.కీరవాణి, జూనియర్ ఎన్టీఆర్ తదితర సినీ  ప్రముఖులు ఈ మహాగ్రంథాన్ని స్వీకరించి ఈ గ్రంథ సౌందర్యాన్ని, రచనా సంకలన వైభవాన్ని ప్రశంసించారు.

భారతదేశంలో తొలిసారిగా ఐదువందల ఆంజనేయ మూల విరాట్టులతో, యంత్ర మంత్ర తంత్రాత్మకంగా పురాణపండ శ్రీనివాస్ అద్భుతంగా రూపొందించిన ఈ ‘నేనున్నాను’ మహాగ్రంధాన్ని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘వారాహి చలనచిత్రం’ అధినేత సాయి కొర్రపాటి సమర్పణాభావంతో ప్రచురించడం గమనార్హం.

అతి అరుదైన ఆంజనేయ వర్ణచిత్రాలతో, నాణ్యతా ప్రమాణాల అపురూప ముద్రణతో, పురాణపండ శ్రీనివాస్ అద్భుత భాషా సొగసులతో చాలా చక్కగా అందిన ఈ హనుమాన్ బడా బుక్ తెలుగులో ఇంతవరకూ ‘నభూతోన్న భవిష్యత్’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. మంత్ర విద్యలకు మహాకేంద్రంగా ఈ హనుమాన్ బుక్ ని నందమూరి బాలకృష్ణ అభివర్ణించారు.

తెలుగు రాష్ట్రాలలోని ఆంజనేయాలయాలకు, వేదపాఠశాలలకు, పండిత ప్రముఖులకు గ్రంథాలయాలకు, సాంస్కృతిక సంస్థలకు ఈ ఐదు వందల పేజీల ఆంజనేయ వైభవాన్ని సాయి కొర్రపాటి ఉచితంగా అందజేస్తుండతాన్ని పలువురు ప్రముఖులు అభినందనలు వర్షిస్తున్నారు.

Sanjay Dutt Happy with Puranapanda Srinivas Nenunnanu:

Nenunnanu to Bollywood Hero Sanjay Dutt

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ