Advertisementt

‘సైరా’లో సురేందర్‌రెడ్డికి నచ్చిన సీన్ ఇదేనంట!

Wed 02nd Oct 2019 10:08 AM
surender reddy,sye raa,sye raa narasimha reddy,highlight scene  ‘సైరా’లో సురేందర్‌రెడ్డికి నచ్చిన సీన్ ఇదేనంట!
Surender Reddy Talks About Sye Raa Highlight Scene ‘సైరా’లో సురేందర్‌రెడ్డికి నచ్చిన సీన్ ఇదేనంట!
Advertisement
Ads by CJ

చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ అయినా సైరా నరసింహ రెడ్డి రిలీజ్‌కి ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో ఫ్యాన్స్ లో అంచనాలు పెరగడంతో పాటు కంగారు పడుతున్నారు. అసలు ఈసినిమాలో సీన్స్ ఎలా ఉంటాయి? ఎంతవరకు ఫ్యాన్స్ కి కనెక్ట్ అవుతాయి అని టెన్షన్ పడుతున్నారు. సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలానే ఉన్నాయని ఆమధ్య వార్తలు వచ్చాయి.

అయితే లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో డైరెక్టర్ సురేంద్ర‌రెడ్డి సినిమాలో హైలెట్ సీన్ ఏమిటనే విషయాన్ని వెల్లడించారు. క్లైమాక్స్ లో వచ్చే సీన్ చూసినప్పుడల్లా తన హృదయం ఉప్పొంగిందని ఆయన వివరించారు. ఈ క్లైమాక్స్ ప్రతిఒక్కరిని ఉద్వేగానికి గురిచేస్తుందని సురేంద్ర రెడ్డి అన్నారు.

నరసింహరెడ్డి బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎంతగా భయపెట్టి వుంటారో... ఆయన వల్ల ఆంగ్లేయులు ఎంతగా బాధ పడి ఉంటే ఆయన తల 30 ఏళ్ళ పాటు ఓ కోటకు వేలాడదీసి ఉంచుతారు? అలానే చివరి సమయంలో ఆయన వెనుక పదివేల సైన్యం ఉందని తెలిసి తాను ఆశ్చర్యపోయానని...ఇవ్వన్ని పరిశోధించి నేను క్లైమాక్స్ రాసుకున్నానని దాని బట్టే క్లైమాక్స్ తీసాను అని చెప్పాడు సురేంద్ర రెడ్డి.

Surender Reddy Talks About Sye Raa Highlight Scene:

Surender Reddy interview about Sye Raa Narasimha Reddy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ