Advertisementt

‘సైరా’: ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు

Tue 01st Oct 2019 10:14 PM
kichha sudeep,vijay sethupathi,sye raa,important roles,chiranjeevi  ‘సైరా’: ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు
Netizens Talks about Vijay Sethupathi and Kichha Sudeep Roles in Sye Raa ‘సైరా’: ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు
Advertisement
Ads by CJ

రేపు విడుదల కాబోతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో పలు భాషల నటీనటులు నటించారు. అందులో తమిళనాట కీలకమైన విజయ్ సేతుపతి, కన్నడలో కీలకమైన కిచ్చా సుదీప్, అలాగే బాలీవుడ్ నుండి అమితాబచ్చన్ నటించారు. వీరంతా ఆయా భాషల్లో స్టార్ నటులు. అయితే సైరా సినిమాలో చిరంజీవి మెయిన్ హీరో. చిరుకి గురువు అమితాబ్. మరి మిగతా నటుల్లో కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతిలకు ఈ సినిమాలో ఎంత లెన్త్ ఉన్న పాత్రలిచ్చారు. అయితే ఆ పాత్రల్లో కిచ్చా సుదీప్ పాత్ర పరిధి, ప్రాముఖ్యత ఎక్కువా, లేదంటే విజయ్ సేతుపతి పాత్ర పరిధికి ప్రాముఖ్యత ఎక్కువా అంటూ వారిద్దరి అభిమానులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.

ఇప్పటికే విజయ్ సేతుపతి పాత్రకి ఇటు తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే తాజా సమాచారం ప్రకారం మిగిలిన కేరెక్టర్ ఆర్టిస్ట్‌ల కన్నా ఎక్కువగా సుదీప్‌కి ప్రాముఖ్యత నిచ్చినట్టుగా సమాచారం. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న సైరా సినిమాకి తెలుగు, హిందీ మార్కెట్స్ ఎంత ముఖ్యమో... కన్నడ మార్కెట్ కూడా అంతే ముఖ్యం. తెలుగు సినిమాలకు కన్నడలో మంచి ఆదరణ ఉండటంతో.. కిచ్చా సుదీప్‌కి ‘సైరా’ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 

Netizens Talks about Vijay Sethupathi and Kichha Sudeep Roles in Sye Raa:

Kichha Sudeep Role Highlight in Sye Raa Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ