బాహుబలి తర్వాత తమన్నా కెరీర్ డౌన్ అయ్యిందనే ప్రచారం జరగడం కాదు కానీ.. నిజంగానే తమన్నాకి సినిమాలు పెద్దగా లేవు. కానీ తర్వాతర్వాత తమన్నా చేతి నిండా సినిమాలతో బిజీ అయ్యింది. బాలీవుడ్ టాలీవుడ్ లలో సినిమాలు చేస్తున్న తమన్నా రీసెంట్ గా సైరా నరసింహారెడ్డితో తెలుగు నుండి తమిళ, మలయాళ, కన్నడ, హిందీ పేక్షకుల ముందుకు రాబోతుంది. సై రా సినిమాలో తమన్నా రోల్ కీలకం సంగతి ఏమో గాని... తమన్నా ప్రస్తుతం తెగ హైలెట్ అవుతుంది. సై రా సినిమాలో మొదటి హీరోయిన్ గా ప్రయారిటీ ఉన్న రోల్ లో నటించిన నయనతార ప్రమోషన్స్ ని లైట్ తీసుకోవడం, తమన్నా సై రా ప్రమోషన్స్ లో రామ్ చరణ్, చిరులతో కలిసి హుషారుగా పాల్గొనడంతో తమన్నా అందరి దృష్టిలో పడుతుంది.
సై రా సినిమాలో రాణి లుక్ తో ఇరగదీస్తున్న తమన్నా సై రా ప్రమోషన్స్ లోను కలర్ ఫుల్ డ్రెస్సులతో టీంతో కలిసి సందడి చేస్తూ దర్శకనిర్మాతలను ఆకర్షిస్తుంది. మరి తమన్నా సై రా ప్రమోషన్స్ చూసాక చిరు నెక్స్ట్ సినిమాకి తమన్నాని తీసుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదనే సంకేతాలు వినబడుతున్నాయి. మరి తమన్నా గనక చిరు నెక్స్ట్ సినిమా హీరోయిన్ అయితే ఆమె పంటపండినట్లే.