Advertisementt

రివేంజ్ యాక్షన్ డ్రామాగా హీరో విరాట్ కొత్త చిత్రం

Mon 30th Sep 2019 11:44 PM
hero virat,di manak,archi films,production no 2,new movie,announcement  రివేంజ్ యాక్షన్ డ్రామాగా హీరో విరాట్ కొత్త చిత్రం
Di Manak, Archi Films Production No 2 New Movie Announcement రివేంజ్ యాక్షన్ డ్రామాగా హీరో విరాట్ కొత్త చిత్రం
Advertisement
Ads by CJ

‘పరిచయం’ ఫేమ్ విరాట్ హీరోగా ది మాంక్, ఆర్చి ఫిల్మ్స్ ప్రొడక్షన్ నంబర్-2 నూతన  చిత్రం ఎనౌన్స్ మెంట్  !!

పరిచయం చిత్రంతో హీరోగా పరిచయమైన విరాట్ హీరోగా నటిస్తున్న ద్వితీయ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.  నితిన్ జి.దర్శకత్వంలో ది మాంక్, ఆర్చి ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బానర్స్ పై సంతోష్ వై.కె, నిమేశ్ దేశాయ్ సంయుక్తంగా రూపొందిస్తున్న ప్రొడక్షన్ నెంబర్-2 చిత్రం షూటింగ్ నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ది మాంక్, ఆర్చి ఫిల్మ్స్ ఇంటర్నేషనల్  బానర్స్ లోగో ఆవిష్కరించారు.  రివేంఙ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం విశేషాలను తెలపడానికి చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో విరాట్, దర్శకుడు నితిన్ జి, నిర్మాతలు సంతోష్ వై.కె, నిమేశ్ దేశాయ్ పాల్గొన్నారు.

హీరో విరాట్ మాట్లాడుతూ... నా మీద నమ్మకంతో నాతో ఈ సినిమా చేస్తున్న నిర్మాత, దర్శకులకు నా థాంక్స్. దర్శకుడు నితిన్ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్. ఆయనతో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం.. అన్నారు.

దర్శకుడు నితిన్ జి. మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ప్రొడక్షన్ లో ఉన్న ఈ నిర్మాతలు సెకండ్ ఫిల్మ్ నాతో చేయడం చాలా ఆనందంగా ఉంది. రివేంజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నాం. ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటించనున్నారు.. అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన సంతోష్ మాట్లాడుతూ... మా బ్యానర్లో ఇది రెండో చిత్రం. దర్శకుడు నితిన్ చెప్పిన స్టోరీ నచ్చి విరాట్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఇదొక రివేంజ్ యాక్షన్ సబ్జెక్ట్. చాలా డిఫరెంట్ గా ఉంటుంది.  మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం.. అన్నారు.

ది మాంక్, ఆర్చి ఫిల్మ్స్ ఇంటర్నేషనల్  పతాకాలపై విరాట్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తున్నారు..

ఈ చిత్రానికి డిఓపి: జైపాల్ రెడ్డి, ఆర్ట్: జెకే మూర్తి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నగేష్ పూజారి, కో-ప్రొడ్యూసర్: అతుల్ పాటిల్, నిర్మాతలు: సంతోష్ వై.కె, నిమేశ్ దేశాయ్, దర్శకత్వం: నితిన్ జి.

Di Manak, Archi Films Production No 2 New Movie Announcement:

Hero Virat New Movie Details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ