డా.రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, శివశంకర్ మాస్టర్ కాంబినేషన్‌లో ‘డ్రీమ్’ ఫేమ్ భవానీ శంకర్ దర్శకత్వంలో మర్డర్ మిస్టరీ చిత్రం ‘క్లైమాక్స్’
ఏడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు గెలుచుకున్న చిత్రం ‘డ్రీమ్’. 2013లో ఆఫ్‌బీట్ క్రియేటివ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం కెనడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రాయల్ రీల్ అవార్డుతో పాటు మరో ఆరు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పురస్కారాలు గెలుచుకుంది. ప్రవాసాంధ్రుడు భవానీ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న మరో చిత్రం ‘క్లైమాక్స్’. కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై పి.రాజేశ్వర్ రెడ్డి, కె.కరుణాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . డా.రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, శివశంకర్ మాస్టర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో సాషా సింగ్, రమేష్, చందు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నిర్మాతల్లో ఒకరైన పి.రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పొలిటికల్ సెటైర్ నేపథ్యంలో నడిచే మర్డర్ మిస్టరీ ఇది. మా సంస్థకు గొప్ప పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుంది. కథాంశంతో పాటు చిత్రీకరణ కూడా విభిన్నంగా, వైవిధ్యంగా ఉంటుంది. ఇందులో తక్కువ పాత్రలే ఉంటాయి కానీ, ప్రతి పాత్రా కూడా ఒక హీరోలాగానే అనిపిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. హైదరాబాద్‌లోనే షూటింగ్ మొత్తం చేస్తున్నాం. ఒక పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేసి తీయబోతున్నాం’’ అని తెలిపారు.
దర్శకుడు భవానీ శంకర్ మాట్లాడుతూ.. ‘‘ఇందులో రాజేంద్రప్రసాద్‌గారి పాత్ర పేరు మోడీ. ఆ పేరు ఎందుకు పెట్టాం అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ పాత్ర కోసం రాజేంద్రప్రసాద్‌గారు స్పెషల్‌గా మేకోవర్ అయ్యారు. కళ్లద్దాలు, టాటూస్‌కి స్పెషల్ కేర్ తీసుకున్నాం. ఇందులో మరో కీలకమైన పాత్రను ఓ స్పెషల్ పర్సన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మ్యూజిక్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. మొత్తం 3 పాటలున్నాయి’’ అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: రాజేష్, కెమెరా: రవికుమార్ నీర్ల, కొరియోగ్రఫీ: ప్రేమ్‌రక్షిత్, ఎడిటింగ్: బస్వా పైడిరెడ్డి, ఆర్ట్: రాజ్‌కుమార్.