అక్టోబర్ 2న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతున్న చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా ఈసినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుని యూబైఏ సర్టిఫికెట్‌తో బయటకు వచ్చింది. రన్ టైం వచ్చేసరికి రెండు గంటల 50 నిమిషాల 50 సెకన్లు ఉండనుందని సమాచారం. అయితే సెన్సార్ రివ్యూ ఏమో కానీ ఓవర్సీస్ నుండి అప్పుడే మొదటి రివ్యూ వచ్చేసింది.
యూఏఈ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు భారీ చిత్రాల విడుదలకు రెండు మూడు రోజుల ముందే తన రివ్యూను బయటపెట్టేస్తాడు. సినిమాను చూసిన అతను సినిమా అద్భుతంగా ఉందని, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రాబోతుందని చెప్పాడు. ఇది కచ్చితంగా బ్లాక్ బస్టర్ చిత్రం అవుతుందని ట్వీట్ చేసాడు. అంతే కాదు ఈమూవీ నేషనల్ అవార్డు ఖాయం అని చెప్పాడు. రివ్యూ పాజటివ్‌గా రావడంతో చిరు ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ చేసేసారు.
ఇక ఈమూవీలో చిరు సరసన నయనతార, ఇతర ముఖ్య పాత్రల్లో అమితాబ్, విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్, జగపతిబాబు నటించారు. సురేంద్ర రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత. దాదాపు 270 కోట్లతో ఈమూవీ తెరకెక్కింది.