‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మళ్లీ సంక్రాంతి రేస్‌లో అడుగు పెడుతున్నాడు మహేష్ బాబు. 2013లో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తరువాత మహేష్ ఇప్పటివరకు సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేయలేదు. సరిగా ఆరేళ్ళ తరువాత మహేష్ సంక్రాంతి రేస్‌లోకి వస్తున్నాడు. అసలు మహేష్‌కు సంక్రాంతి సీజన్ కలిసి వస్తుందో.. రాదో ఒక లుక్ వేస్తే..
గతంలో మహేష్ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ చేసాడు. మొదటగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన టక్కరి దొంగ చిత్రం సంక్రాంతి పండగకు రిలీజ్ అయింది. ఈమూవీ మిక్స్డ్ టాక్ తో పర్లేదు అనిపించుకుంది. ఆ చిత్రం రిలీజ్ అయిన రెండేళ్లకు 2003లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సంక్రాంతికి విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టింది. మళ్లీ చాలా గ్యాప్ తీసుకుని సరిగా తొమ్మిది ఏళ్ళ తరువాత 2012 లో పూరి తెరకెక్కించిన బిజినెస్ మెన్ చిత్రంతో మరో హిట్ అందుకున్నాడు.
కానీ ఆ తరువాత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన వన్ నేనొక్కడినే మాత్రం అనుకున్న స్థాయి విజయం సాధించలేదు. ఆ తరువాత ఏడాది 2013 లో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో మరో హిట్ అందుకున్నాడు మహేష్. ఇలా చూసుకుంటే మహేష్‌కు సంక్రాంతి సినిమాలలో రెండు సూపర్ హిట్లు, ఒక బ్లాక్ బస్టర్ హిట్ రెండు యావరేజ్ సినిమాలు ఉన్నాయి. అంటే ఓవరాల్‌గా మహేష్‌కు సంక్రాంతి కలిసొచ్చినట్టే.