ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని పలు రాష్టాల్లో భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం అవుతుంది. హైదరాబాద్ , ముంబై, పూణే లాంటి మహానగరాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని గంటగంటకు చూపెడుతున్నాడు. మరో నాలుగు రోజుల పాటు ఇదే స్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరి ఇలాంటి టైంలో చిరంజీవి సై రా సినిమాని ఇండియా వైడ్ గా దింపుతున్నాడు. అసలే ప్రమోషన్స్ వీక్ గా వున్నాయి. ఏదైనా ప్రమోషన్స్ ని చేద్దామంటే వర్షం తగులుకుంటుంది. మరి దేశంలోని పలు రాష్ట్రాలు వర్షాలకు కొట్టుకుపోతున్న సమయంలో సై రా థియేటర్స్ లోకి వస్తే.. అది సినిమా కలెక్షన్స్ మీద ప్రభావం చూపడం ఖాయం.
సినిమాకి హిట్ టాక్ పడినా.. వర్షాలు తగ్గుముఖం పడితేనే కలెక్షన్స్ అదురుతాయి. అదే ప్లాప్ టాక్ పడిందా ఇక అంతే సంగతులు. ప్రమోషన్స్ కి అడ్డం పడుతున్న వరుణుడు కలెక్షన్స్ కి అడ్డం పడకుండా ఉంటే చాలు అంటూ మెగా ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. ఇక హైదరాబాద్ లాంటి మహానగరంలో సై రా సినిమా కోసం మల్టిప్లెక్స్ ఆడియన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు కానీ వర్షం పడితే బయటికొచ్చే పరిస్థితి లేదు. హ్యాపీగా సినిమాకి వెళదామంటే వర్షం అడ్డొస్తే చాలు ఆగిపోవాలి. లేదంటే ట్రాఫిక్ కష్టాలు. మరి సై రా సినిమా వచ్చేటప్పటికల్లా వర్షాలు సద్దుమణిగితే ఓకే.. లేదంటే కష్టం.