మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. రామ్‌చరణ్ నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ అక్టోబర్- 2న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. తాజాగా.. బాలీవుడ్ నటుడు, సైరా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఫర్హాన్ అఖ్తార్.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవిను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో చిరు గురించి ఓ ఆసక్తికర విషయాన్ని అమితాబ్ చెప్పుకొచ్చారు.
అయితే తెలుగులో కూడా త్వరలోనే స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. చిరును ఇంటర్వ్యూ చేస్తారని సమాచారం. కాగా ప్రభాస్ ప్రస్తుతం ఇటీవలే పారిస్ టూర్‌లో బిజీబిజీగా ఉన్నారు. అయితే ‘సైరా’ సినిమా రిలీజ్‌కి ముందు ప్రభాస్ వస్తాడనీ, ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొంటాడనే టాక్ కొంతకాలంగా నడుస్తున్న సంగతి తెలుస్తోంది. ప్రమోషన్‌లో భాగంగా కాస్త వెరైటీగా ప్రభాస్‌తో ఇంటర్వ్యూ చేయించాలని చిత్రయూనిట్ భావించిందట. ఈ క్రమంలో ప్రభాస్‌ను అడగ్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
ఈ వీడియో ఇంటర్వ్యూ అన్ని చానెల్స్‌కు ఇస్తారట. అంటే.. ప్రభాస్ యాంకర్‌గా క్వశ్చన్స్ అడుగుతుంటే చిరంజీవి సమాధానం ఇస్తారన్న మాట. అంతేకాదు కాస్త టైమ్ దొరికితే చిరుతో పాటు రామ్‌చరణ్‌ను కూడా ప్రభాస్ ఇంటర్వ్యూ చేస్తారని తెలుస్తోంది. అయితే ఇది నిజమా లేకుంటే ఎవరైనా కావాలనే ఇలా న్యూస్‌ను వైరల్ చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. కాగా.. మెగాస్టార్ అంటే ప్రభాస్‌కి అమితమైన గౌరవమన్న విషయం తెలిసిందే.