బిగ్ బాస్ సీజన్ విన్నర్ ఎవరో బిగ్ బాస్ డిసైడ్ చేసేసాడు. ఈ సీజన్ లో శ్రీముఖి గెలవాలని బిగ్ బాస్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ వేసే ప్రతి అడుగు శ్రీముఖి కోసమే అని అర్ధం అయిపోతుంది. అలీ ఇంటి నుండి వెళ్ళిపోయినా తరువాత శ్రీముఖి గేమ్ కూడా డౌన్ అయిపోయింది. ఆమె డౌన్ అవ్వడం బిగ్ బాస్ కి నచ్చలేదేమో ఇటుకల టాస్క్‌లో రాహుల్, వరుణ్ ఫిజికల్ అవుతున్నా ఎక్కడా బిగ్‌బాస్ ఇంటర్‌ఫియర్ అవ్వలేదు. దాంతో శ్రీముఖి టీం గెలిచింది. కెప్టెన్సీ కి నామినేట్ అయింది.
అలా నామినేట్ అయిందో లేదో వెంటనే హౌస్ లోకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా అలీ ని పంపారు. కనీసం ఆడియన్స్ పోల్ కూడా తీసుకోకుండా అలీ రెజాని శ్రీముఖి కోసమే పంపించారనేది అందరికీ తెలుసు. అప్పటికే వరుణ్ అండ్ రాహుల్ రెండు టీమ్స్ గా విడిపోయారు. దాంతో శ్రీముఖికి ఇంకా ప్లస్ అయింది. అలీ రెజా ఎలాగో బయటకు పోయి వచ్చాడు కనుక ఇక అతడిని ఎలాగో గెలవనివ్వరు. ఈవారం రవి కృష్ణ వెళ్లిపోయే అవకాశం ఉందని తెలుస్తుంది. శివజ్యోతి ఫైనల్ వరకు వెళ్లే ఛాన్స్ లేదు. వితిక అండ్ పునర్నవి నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. సో హౌస్ లో ఇంకా స్ట్రాంగ్ గా ఉంది శ్రీముఖి అండ్ వరుణ్. ఇద్దరు మధ్య పోటీలో శ్రీముఖిని బిగ్ బాస్ గెలిపించే అవకాశం ఉందని అర్ధం అవుతుంది. మరి ఇవన్నీ అన్‌ఫెయిర్ టాక్టిక్స్ అని ఆడియన్స్ తిప్పి కొడతారా లేక పట్టనట్టు ఊరుకుంటారా అనేది చూడాలి.