Advertisementt

రాజమౌళి, ఎన్టీఆర్.. భలే షేర్ చేసుకున్నారు

Sun 29th Sep 2019 01:22 PM
ntr,rajamouli,student no 1,completes,18 years  రాజమౌళి, ఎన్టీఆర్.. భలే షేర్ చేసుకున్నారు
NTR, Rajamouli’s Student No 1 Completes 18 Years రాజమౌళి, ఎన్టీఆర్.. భలే షేర్ చేసుకున్నారు
Advertisement
Ads by CJ

రాజమౌళి - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ రిలీజ్ అయ్యి నిన్నటితో 18 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాజమౌళి అండ్ ఎన్టీఆర్ తమ ట్విట్టర్ ఖాతాలో 18 ఏళ్ళ కిందట షూటింగ్ టైములో దిగిన ఫొటోస్ షేర్ చేసుకుని అలానే ఇప్పుడు అదే ఫొటోస్ కి అచ్చం అటువంటి స్టిల్ ఇచ్చి దిగిన ఫొటోస్ ఇద్దరూ షేర్ చేసుకుని ఆ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.

రాజమౌళి ఓ ఫోటో షేర్ చేస్తూ...‘‘18 ఏళ్ళు అయింది. స్టూడెంట్ నెం.1 ఈరోజే రిలీజ్ అయింది. అనుకోకుండా ఈరోజు మేమిద్దరం రామోజీ ఫిలిం సిటీలోనే ఉన్నాం. చాలా మారిపోయింది.. తారక్ సన్నగా మారిపోయాడు. నేను పెద్ధవాడిని అయ్యాను’’. అంటూ కామెంట్ పెట్టాడు.

ఎన్టీఆర్ ఏమో ‘‘కాకతాళీయంగా మేము ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాం. అనుకోకుండా మేము ఇక్కడే రామోజి ఫిలింసిటీలో RRR షూటింగ్ చేస్తున్నాం. స్టూడెంట్ నెం.1 లో ఓ సీన్ ఎక్కడైతే షూట్ చేసామో సరిగా అక్కడే ఓ సీన్ చిత్రీకరించాం..  ఎంతో మారిపోయింది కానీ జక్కన్నతో పని చేయడంలో ఫన్ మాత్రం సేమ్’’ అంటూ ట్వీట్ చేశారు. వారు దిగిన పాత ఫొటోస్ కొత్త ఫొటోస్ రెండు కలిపి షేర్ చేసారు.

NTR, Rajamouli’s Student No 1 Completes 18 Years:

NTR, Rajamouli Then And Now

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ