Advertisementt

బుల్లితెరపై ‘గద్దలకొండ గణేష్’.. పంచ్‌ల వర్షం!

Sat 28th Sep 2019 07:14 PM
hyper aadi,gaddalakonda ganesh,varun tez,jabardasth  బుల్లితెరపై ‘గద్దలకొండ గణేష్’.. పంచ్‌ల వర్షం!
hyper aadi acts as a gaddalakonda ganesh in jabardasth బుల్లితెరపై ‘గద్దలకొండ గణేష్’.. పంచ్‌ల వర్షం!
Advertisement
Ads by CJ

ఇదేంటి నిన్నగాక మొన్న రిలీజ్ అయిన ‘వాల్మీకి’ అలియాస్ ‘గద్దలకొండ గణేష్’ అప్పుడే బుల్లితెరపై వస్తోందా..? అని ఆశ్చర్యపోతున్నారేమో.. అదేం కాదండోయ్.. అదేనండి జబర్దస్త్‌ షోలో కమెడియన్ హైపర్ ఆదీనే గద్దలకొండ గణేష్‌గా మారిపోయాడు. ప్రస్తుతం ఏ సినిమాల్లో అయితే మంచి విషయం ఉంటుందో అందులో చిన్న పాత్రను తన రూపంలో బయటపెడుతుంటాడు ఆది. ఇప్పుడు గద్దలకొండ గణేష్ సినిమా జనాలకు బాగా ఎక్కడంతో ఆ పాత్ర చేయాలని జబర్దస్త్ షో వేదికగా పెద్ద హంగామానే చేశాడు.

అచ్చం వరుణ్ తేజ్‌లాగా ఆది దిగిపోయాడు. నెట్టింట్లో ఈ గెటప్‌కు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ స్కిట్‌లో ఆదితో పాటు రోహిణి కూడా కనిపిస్తోంది. అసలే ఆదికి ‘పంచ్‌లరాయుడు’ అని పేరుంది.. ఈ స్కిట్‌లో మాత్రం మరింత డోస్ పెంచి మరీ హంగామా చేశాడు. ఈయనతో పాటు మిగిలిన వాళ్లు కూడా అదిరిపోయే పంచ్ డైలాగులతో దుమ్ము దులిపేసారని చెప్పుకోవచ్చు.

hyper aadi acts as a gaddalakonda ganesh in jabardasth:

hyper aadi acts as a gaddalakonda ganesh in jabardasth

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ