Advertisementt

మణిరత్నం సినిమాలో ఆయన.. అనుష్క ‘నో’!!

Sat 28th Sep 2019 03:11 PM
anushka shetty,rejected,mani ratnam project,ponniyin selvan  మణిరత్నం సినిమాలో ఆయన.. అనుష్క ‘నో’!!
Is this why Anushka Shetty rejected Mani Ratnam project మణిరత్నం సినిమాలో ఆయన.. అనుష్క ‘నో’!!
Advertisement
Ads by CJ

దేశం గర్వించదగిన దర్శకుల జాబితాలో మణిరత్నం పేరుంటుదన్న విషయం జగమెరిగిన సత్యమే. ఎందుకంటే వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని, సామాజిక సందేశాలను అందించే కథలనే మణిరత్నం తెరకెక్కిస్తుంటారు. అందుకే ఈయనకు ఎన్ని పేర్లు పెట్టినా.. ఎన్ని బిరుదులిచ్చినా తక్కువే మరి. ఇప్పటికే చేయాల్సిన ప్రయోగాలు చేసేసిన మణిరత్నం.. ఇప్పుడు చారిత్రక నేపథ్యమున్న కథను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కథకు ‘పొన్నియన్ సెల్వన్’ అనే పేరును ఖరారు చేసేశారు కూడా. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మణిరత్నం నిర్మిస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఇప్పటికే.. విక్రమ్, కార్తీ, పార్తీబన్, మోహన్ బాబు, విజయ్ సేతుపతి, జయం రవి, అనుష్క, కీర్తి సురేశ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నట్లు పక్కా సమాచారం ఉంది. అయితే ఈ జాబితాలోకి ఈ మధ్య అందాల తార, ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కూడా చేరింది. అయితే.. తాజాగా అందిన సమాచారం మేరకు అనుష్క సినిమా నుంచి తప్పుకుందట. 

భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నటించేందుకు మొదట ఓకే చెప్పిన ఈ ముదురు భామ ఆ తర్వాత రెడ్ సిగ్నల్ వేసిందట. ఇందుకు కారణం ‘వైరిముత్తు’ అనే నటుడు కమ్ కవి, నావలిస్ట్‌ ఈ సినిమాలో ఓ పాత్రలో చేస్తున్నట్లు తెలుసుకున్న ఈ యోగా బ్యూటీ.. మణిరత్నంకు నో చెప్పేసిందని టాక్ నడుస్తోంది. కగా వైరిముత్తుపై గతంలో సింగర్స్‌, నటీమణులను లైంగికంగా వేధించినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Is this why Anushka Shetty rejected Mani Ratnam project:

Is this why Anushka Shetty rejected Mani Ratnam project

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ