Advertisementt

చిరు-కొరటాల సినిమాకు హీరోయిన్ ఫిక్స్!

Sat 28th Sep 2019 02:57 PM
chiru-koratala movie,heroine,trisha,chiranjeevi,koratala shiva  చిరు-కొరటాల సినిమాకు హీరోయిన్ ఫిక్స్!
Chiru-Koratala Movie Heroine Fix..! చిరు-కొరటాల సినిమాకు హీరోయిన్ ఫిక్స్!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’ రిలీజ్ తర్వాత.. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి చిత్రానికి సంబంధించి ‘ఇదిగో కథ..’ ‘మ్యూజిక్ డైరెక్టర్ మారారు..’ ‘దేవీ శ్రీని పక్కనెట్టి బాలీవుడ్‌ను పట్టుకొచ్చారు..’ ఇలా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఇంతకు మించిన ఓ వార్త ఫిల్మ్‌నగర్‌లో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. చిరు కోసం ఒకప్పుడు ఆయన సరసన నటించిన ముద్దుగుమ్మనే కొరటాల పట్టుకొస్తున్నాడన్నదే ఈ వార్త సారాంశం.

ఇప్పటికే సినిమా కథ మొత్తం పూర్తి చేసిన కొరటాల హీరోయిన్‌గా ఎవర్ని తీసుకోవాలి..? ఎవరైతే సెట్ అవుతారని ఇప్పటి వరకూ సెర్చింగ్‌ చేసిన ఆయన ఫైనల్‌గా త్రిషను ఖరారు చేసినట్లు సమాచారం. వాస్తవానికి ‘స్టాలిన్’ సినిమాలో చిరుతో కలిసి ఈ ముద్దుగుమ్మ రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. వీరి రొమాన్స్ బాగానే పండిందని.. ఇప్పుడు అదే త్రిషను ఈ సినిమాలో కూడా తీసుకుంటే బాగుంటుందని భావించి ఓకే చెప్పేశారట. అయితే చిరు సరసన నటించాలని త్రిషను సంప్రదించగా.. చిరు సార్‌తోనా నేను రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.

వాస్తవానికి మొదట్నుంచి నయనతార, కాజల్, తమన్నా, హ్యుమ ఖురేషి పేర్లు ప్రచారం జరిగాయి. ఈ సారి ఏకంగా త్రిష పేరే వినబడుతోంది.  అయితే చిరు-త్రిష జోడి గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వీరి రొమాన్స్‌కు, చిరు సరసన నటనకు త్రిషకు మంచి మార్కులు పడ్డాయి. మరి త్రిషనే లాస్ట్‌వరకు లైన్‌లో పెడతాడా లేకుంటే మళ్లీ కొరటాల మనసు మార్చుకుంటాడా..? అనేది తెలియాల్సి ఉంది.

Chiru-Koratala Movie Heroine Fix..!:

Chiru-Koratala Movie Heroine Fix..!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ