మహేష్ - రాజమౌళి కాంబినేషన్ లో సినిమా. ఈ న్యూస్ వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది కదూ! టాలీవుడ్ ప్రేక్షకులు మొత్తం ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి పవన్ కళ్యాణ్, మహేష్ లాంటి పెద్ద స్టార్స్ తో సినిమా తీయలేదు.
కారణాలు ఏమో కానీ వీరిద్దరితో జక్కన్న ఒక్క సినిమా కూడా చేయలేదు. వీరిలో ఒక్కరితో అయినా రాజమౌళి సినిమా చేస్తే దాని రికార్డ్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలకి దూరంగా పాలిటిక్స్ కి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా మిగిలింది మహేష్ ఒక్కడే. తాగాజా వీరి కాంబినేషన్ లో మూవీ రాబోతుందని వార్తలు వస్తున్నాయి. RRR తరువాత రాజమౌళి మహేష్ తో సినిమా చేస్తున్నాడు అని రూమర్స్ వస్తున్నాయి.
మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ రాజమౌళి మాత్రం ఆ సినిమాను జేమ్స్ బాండ్ తరహా నేపథ్యంలో తెరకెక్కించనున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ కథ కూడా సిద్ధంగా ఉందని రూమర్స్ రావడం హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ కాంబినేషన్ లో సినిమా ఉండాలని మహేష్ ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో అని.