Advertisementt

అబ్బే అదంతా తూచ్.. దేవీశ్రీనే తీసుకుంటున్నా!

Sat 28th Sep 2019 07:08 AM
koratala siva,devi sriprasad,megastar chiranjeevi,music  అబ్బే అదంతా తూచ్.. దేవీశ్రీనే తీసుకుంటున్నా!
Koratala Siva Gives Clarity Over Devi Sri For Chiru Movie అబ్బే అదంతా తూచ్.. దేవీశ్రీనే తీసుకుంటున్నా!
Advertisement
Ads by CJ

అవును.. టాలీవుడ్‌ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన కొరటాల శివ మళ్లీ మనసు మార్చుకున్నాడట. కొరటాల-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వస్తున్న సినిమా కోసం రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ను కాకుండా బాలీవుడ్‌ నుంచి సంగీత దర్శకులను తీసుకున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా మొన్నటి వరకే.. అబ్బే అదేం లేదు అంతా తూచ్.. ఆ వార్తలన్నీ పుకార్లేనట. తాజా సమాచారం మేరకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌ అమిత్ త్రివేదిని కాకుండా మళ్లీ దేవీ శ్రీకే కొరటాల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.

ఇలా పుకార్లు వస్తున్న నేపథ్యంలో స్వయంగా దేవీ శ్రీకి ఫోన్ చేసిన కొరటాల.. సినిమా కోసం రంగం సిద్ధం చేసుకోవాలని సూచించారట. ఇందుకు కారణాలు లేకపోలేదు..‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ ఈ మూడు టాప్ సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా.. మ్యూజిక్ పరంగా మంచి టాక్ వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూడు సినిమాలు బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తోనే నడిచేశాయి. అందుకే చిరు సినిమాకు మళ్లీ ఆయన్నే తీసుకోవాలని ఫిక్స్ అయిన కొరటాల ఫిక్స్ అయ్యారని టాలీవుడ్, ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో నిజమెంతో తెలియాలంటే కొరటాల నుంచి లేదా.. దేవీ నుంచి గానీ అధికారిక ప్రకటన వెలువడాల్సిందే మరి.

Koratala Siva Gives Clarity Over Devi Sri For Chiru Movie:

Koratala Siva Gives Clarity Over Devi Sri For Chiru Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ