Advertisementt

సందీప్ కిషన్‌కు ఆ సలహా ఇస్తున్నారు!

Sat 28th Sep 2019 07:06 AM
sundeep kishan,acted,web series,netizens,suggestions  సందీప్ కిషన్‌కు ఆ సలహా ఇస్తున్నారు!
Sundeep Kishan Acted Web Series Started సందీప్ కిషన్‌కు ఆ సలహా ఇస్తున్నారు!
Advertisement
Ads by CJ

ఇప్పుడు చాలామంది నటులు సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లోను యాక్టీవ్ అవుతున్నారు. టాప్ హీరోయిన్ సమంత లాంటోళ్లే వెబ్ సీరీస్ కి ప్రాధాన్యమిస్తుంటే.. చిన్న నటులు కూడా వెబ్ సీరీస్ బాట పడుతున్నారు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లలో వెబ్ సీరీస్ కి ఎంత పాపులారిటీ క్రేజ్ ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. ఇక వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోగా మారిన సందీప్ కిషన్ కి ఈ మధ్యన సినిమాలేమి కలిసి రాలేదు. నిన్నగాక మొన్నొచ్చిన నినువీడని నీడను నేనే సినిమాకి హిట్ టాకొచ్చినా ప్రమోషన్స్ లేక సినిమా ప్లాప్ అయ్యింది. ఇక తాజాగా తెనాలి రామకృష్ణ సినిమాతో సెట్స్ మీదున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు వెబ్ సీరీస్ తో అదరగొట్టేస్తున్నాడు.

అమెజాన్ ప్రైమ్ లో ది ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ తో సందీప్ కిషన్ కమాండో ఆఫీసర్ గా అదరగొట్టేస్తున్నాడు. మనోజ్ బాజ్పాయ్ హీరోగా, ప్రియమణి ముఖ్య పాత్రలో తెరకెక్కిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ లో సందీప్ కిషన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సైనికుడిగా అదరగొట్టేసాడు. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియాలో పలు బాంబ్ బ్లాస్ట్ లకు ప్లాన్ చేస్తుంటే.. వాటిని తిప్పికొట్టడానికి మనోజ్ బాజ్పాయ్ టీం చేసే ప్రయత్నంలో సందీప్ కిషన్ వారికీ సహాయం చేసే విక్రమ్ వేద్ కమాండో ఆఫీసర్ పాత్రలో అదరగొట్టేసాడు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ చూసాక చాలామంది సందీప్ కిషన్ ని సినిమాలు కలిసిరావట్లేదు కదా.... వెబ్ సీరీస్ కి దూకేయ్ అంటూ సలహాలిస్తున్నారు.

Sundeep Kishan Acted Web Series Started:

Netizens Suggestions to Sundeep Kishan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ