టాలీవుడ్‌లో ప్రస్తుతం పూజా హెగ్డే జోరు గట్టిగానే సాగుతోంది. సీనియర్, జూనియర్ ఇలా ఎవరితో సినిమా అయినా సరే మొదట హీరోయిన్‌గా పూజా అయితే బాగుంటుందని ఆమెనే సంప్రదిస్తున్నారట. అంటే టాప్ హీరోయిన్‌గా నిలిచిపోయిందన్న మాట. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కుర్ర హీరోల సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దగుమ్మ.. యంగ్ రెబల్ స్టార్ సరసన ‘జాన్’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని రాధాకృష్ణ తెరకెక్కిస్తుండగా.. యువీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.
అయితే.. ఇప్పటి వరకూ ఈ అమ్మడు నటించిన ప్రతి సినిమాలో డిఫరెంట్ పాత్రల్లో చేసింది. మరి జాన్ సినిమాలో ఎలాంటి పాత్రలో నటించబోతోందని ఆమె వీరాభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇదే టైమ్‌లో సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. జాన్ సినిమాలో పూజా హెగ్దే స్కూల్ టీచర్‌గా భిన్న పాత్రలో నటిస్తోందన్నది ఆ అప్డేట్ సారాంశం. సో.. ఈమె స్కూల్ టీచర్‌గా ఉండగా.. ప్రభాస్‌కు పరిచయం అవుతుందని అలా ప్రేమలో పడి లవ్ బర్డ్స్‌లా విహరిస్తారట.
కాగా.. 1960 కాలంలో యూరప్‌లో జరిగిన ఒక అందమైన ప్రేమకథను ఆధారంగా చేసుకుని రాధాకృష్ణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే సినిమా షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. మరోవైపు ప్రభాస్ ఢీ కొట్టడానికి జగపతిబాబును విలన్ పాత్రలో నటించడానికి దర్శకనిర్మాతలు సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.