టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అనే కాంట్రవర్సీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎవరెవరి పాత్రలుంటాయ్.. సినిమా నేపథ్యముంటుంది అనే విషయాలను దాదాపు రివీల్ చేసేశారు ఆర్జీవీ. అయితే ఇప్పటి వరకూ మేల్ పాత్రలను మాత్రమే పరిచయం చేసిన వర్మ.. ఫీ-మేల్ పాత్రదారులను మాత్రం పరిచయం చేయలేదు. ఇందుకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు.
అయితే తాజాగా.. ఈ సినిమాలో వివాదాస్పద నటి.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన శ్రీరెడ్డి నటిస్తోందని సమాచారం. ఈమెకు సినిమాలో ఓ కీలక పాత్ర ఇచ్చారని తెలుస్తోంది. ఈ పాత్ర శ్రీరెడ్డికే ఇవ్వడానికి కూడా ఓ కారణం ఉందట. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో వివాదం చెలరేగినప్పుడు.. జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌పై ఆర్జీవీనే విమర్శలు చేయించడం.. ఆ తర్వాత పెద్ద కథలే నడిచాయి. ఈ క్రమంలో శ్రీరెడ్డి-ఆర్జీవీ మిత్రులయ్యారు. అలా ఏర్పడిన వీరి పరిచయం ఒకానొక సమయంలో కోటి రూపాయిల ఆఫర్‌ను శ్రీరెడ్డి తిరస్కరించింది.. అయితే ఆ కోటిరూపాయిలు ఎందుకు..? ఏ విషయంలో ఆఫర్ చేశాడన్న విషయం ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.
అప్పట్లో ఆమె ఈ ఆఫర్‌ను తిరస్కరించడంతో అందుకు రుణంగా ప్రస్తుతం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ ఓ కీ రోల్ ఇస్తున్నాడట. ఈమె చేసిన ఈ పాత్రే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందట. అయితే ఆ పాత్రేంటి..? అనేది మాత్రం చివరి వరకు ఎక్కడా రివీల్ కాకూడదని చాలా గోప్యంగా ఉంచుతున్నారట. గతంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో కూడా శ్రీకు మంచి పాత్ర ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. చివరికి అది జరగలేదు. మరి తాజాగా వస్తున్న పుకార్లు ఏ మాత్రం నిజమవుతాయో వేచి చూడాలి మరి.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోలు, సాంగ్స్‌ను సైతం ఆర్జీవీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. రిలీజ్‌కు వెళ్తుందో లేదో వేచి చూడాల్సిందే మరి.