Advertisementt

వెంకీ-సురేశ్‌కు కథ నచ్చింది.. ఇక త్వరలోనే!

Fri 27th Sep 2019 12:18 PM
victory venkatesh,daggubati suresh babu,venky mama,tarun bhaskar  వెంకీ-సురేశ్‌కు కథ నచ్చింది.. ఇక త్వరలోనే!
Victory Venky Next Movie With...!! వెంకీ-సురేశ్‌కు కథ నచ్చింది.. ఇక త్వరలోనే!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సీనియర్ నటుడు, అలనాటి స్టార్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేశ్‌కు ‘ఎఫ్-2’ సినిమాతో మంచి రోజులొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ హిట్టవ్వడంతో ఇప్పటి కుర్ర హీరోలను ఢీ కొట్టడానికి సై అంటున్నాడు. తాజాగా.. తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి.. ‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తున్నాడు. సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ సినిమాను అభిమానుల ముందుకు తీసుకురాడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ‘పెళ్లి చూపులు’ సినిమాతో టాలీవుడ్‌లో సత్తా చాటిన తరుణ్ భాస్కర్.. వెంకీ కోసం ఓ డిఫరెంట్ కథను రెడీ చేశారట. ఈ కథను వెంకీ, దగ్గుబాటి సురేశ్ బాబుకు కథ చెప్పగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అంతేకాదు ఈ సినిమాను తానే నిర్మిస్తానని కూడా సురేశ్ ఒప్పుకున్నారట. ఈ కథ మొత్తం హార్స్ రైడింగ్ నేపథ్యంలో నడుస్తుందని సమాచారం. ప్రస్తుతం ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో.. ఫిల్మ్‌నగర్‌లో ఇందుకు సంబంధించిన వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.

Victory Venky Next Movie With...!!:

Victory Venky Next Movie With...!!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ