కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా కెరీర్ లో దూసుకుపోతున్న విజయ్ సేతుపతికి తెలుగులోనూ వీరాభిమానులు ఏర్పడ్డారు. ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలో తమిళనాడు బిడ్డగా కీలక పాత్రలో అదిరిపోయే లుక్ లో విజయ్ సేతుపతి కనిపిస్తున్నాడు. ఇకపోతే విజయ్ సేతుపతి పాత్ర నచ్చితే చాలు.. ఎలాంటి కేరెక్టర్ చెయ్యడానికైనా సిద్దమంటాడు. కేరెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా, అది విలన్ గా అయినా. తెలుగులో వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించడానికి ఒప్పుకుని అందరికి షాకిచ్చాడు. తాజాగా విజయ్ సినిమాలోనూ విజయ్ సేతుపతి విలన్ రోల్ ప్లే చేయబోతున్నాడనే న్యూస్ ఉంది.
అయితే ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి విలన్ రోల్ కి ఒప్పుకున్నాడంటే.. అందరూ అబ్బో విజయ్ సేతుపతి సూపర్ అన్నారు. తాజాగా ఆ విలన్ కేరెక్టర్ చెయ్యడానికి విజయ్ సేతుపతికి నిర్మాతలు అక్షరాలా 5 కోట్లు సమర్పిస్తున్నారట. మొదట్లో విజయ్ వద్దు ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడని అనుకున్నప్పటికీ.... దర్శకుడు విజయ్ సేతుపతి అయితే ఇటు తెలుగు, అటు తమిళ్ లోను డిమాండ్ ఉంటుంది. ఉప్పెన తెలుగు, తమిళ్ లోను విడుదల చెయ్యొచ్చని చెప్పడంతో నిర్మాతలు విజయ్ ని తీసుకున్నారట. మరి విజయ్ ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రిగా నెగెటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు.