Advertisementt

టీజర్‌ చూసి థ్రిల్లయ్యాను: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌

Thu 26th Sep 2019 06:09 PM
raagala 24 gantallo teaser,trivikram srinivas,raagala 24 gantallo movie,raagala 24 gantallo  టీజర్‌ చూసి థ్రిల్లయ్యాను: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌
Trivikram Srinivas Launches Raagala 24 Gantallo Teaser టీజర్‌ చూసి థ్రిల్లయ్యాను: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌
Advertisement
Ads by CJ

‘‘సినిమా టీజర్‌ చాలా బాగుంది. ఖచ్చితంగా ఆడియన్స్‌ థ్రిల్‌ ఫీలవుతారు’’ అంటున్నారు టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్‌ సమర్పణలో శ్రీ నవ్‌హాస్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీనివాస్‌ కానూరు నిర్మించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్, ఇషా రెబ్బా జంటగా నటించిన ఈ చిత్రానికి ‘ఢమరుకం’ శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహించారు. శ్రీరామ్, గణేశ్‌ వెంకట్రామన్, కృష్ణ భగవాన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. అక్టోబర్‌ 18న ఈ చిత్రం విడుదల కానుంది. చిత్ర టీజర్‌ను దర్శకుడు త్రివిక్రమ్‌ చేతుల మీదుగా విడుదల చేయించింది చిత్రబృందం. 

ఈ సందర్భంగా త్రివిక్రమ్‌ మాట్లాడుతూ ‘‘సినిమా టైటిల్‌ బావుంది. టీజర్‌ చూశాను. నిజంగా చాలా థ్రిల్‌ ఫీలయ్యాను. రఘు కుంచె మ్యూజిక్, కెమెరామేన్‌ అంజి వర్క్‌ బావుంది. దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డికి, నిర్మాత శ్రీనివాస్‌ కానూరుకు ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. 

‘‘మా చిత్రం టీజర్‌ను విడుదల చేసిన గ్రేట్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ గారికి చాలా థ్యాంక్స్‌’’ అన్నారు దర్శక, నిర్మాతలు. 

ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి, నిర్మాత శ్రీనివాస్‌ కానూరుతో పాటు సంగీత దర్శకుడు రఘు కుంచె, కెమెరామేన్‌ ‘గరుడవేగ’ ఫేమ్‌ అంజి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : బాబా అలీ పాల్గొన్నారు.

Trivikram Srinivas Launches Raagala 24 Gantallo Teaser:

Raagala 24 Gantallo Teaser Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ