టైటిల్ చూడగానే కాసింత ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాను ఎన్నిసార్లు రిలీజ్ చేస్తారు..? అనుకుంటున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే.. రిలీజ్ చేసిన సినిమాను మళ్లీ థియేటర్లలోకి తెస్తున్నారంటే ఏ రేంజ్‌లో లాభాలు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. అసలెందుకు సెకండ్ టైమ్ రిలీజ్ చేస్తున్నారనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం జులై 19న విడుదలై మంచి మాస్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు.. కలెక్షన్లు కూడా ఊహించని రేంజ్‌లో వచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమా ఇంతలా హిట్టవుతుందని కానీ.. ఈ రేంజ్‌లో కాసుల వర్షం కురుస్తుందని పూరీ కలలో కూడా ఊహించి ఉండరు. మరోవైపు.. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈ చిత్రం రామ్ కెరీర్‌లోనే బెస్ట్ హిట్‌గా నిలిచింది.
అందుకే తన పుట్టిన రోజును పురస్కరించుకుని మరోసారి సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని చార్మీ అధికారికంగా ప్రకటించింది. అయితే అన్ని థియేటర్లలో కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన పది థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ‘నీ థియేటర్లలో నా బొమ్మ’ అంటూ ఈ నెల 27, 28, 29వ తేదీల్లో విడుదల చేయబోతున్నట్లు చార్మి చెప్పుకొచ్చింది. మరి ఈ సారి సెకండ్ టైమ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏ మాత్రం సందడి చేస్తుందో వేచి చూడాల్సిందే మరి.