Advertisementt

‘యువరాణి’ పూజా వచ్చేస్తోందహో..!!

Thu 26th Sep 2019 02:42 PM
housefull 4,rajkumari mala,pooja hegde,akshay kumar  ‘యువరాణి’ పూజా వచ్చేస్తోందహో..!!
HOUSEFULL 4 Pooja Hegde First Look Release ‘యువరాణి’ పూజా వచ్చేస్తోందహో..!!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో చిన్నపాటి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్దే.. ఇప్పుడు టాప్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలోనే ఓ వెలుగు వెలుగుతోంది. టాలీవుడ్‌ ఒకట్రెండు తరాల హీరోల సరసన నటించేసిన ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కనీసం సినిమాకు.. సినిమాకు కాస్త కూడా గ్యాప్ లేకుండా అవకాశాలు వచ్చేస్తున్నాయి. నిన్నగాక మొన్న ‘అరవింద సమేత’.. ఆ తర్వాత ‘మహర్షి’.. అనంతరం ‘వాల్మీకి’ ఇప్పుడు ప్రభాస్, అల్లు అర్జున్, అఖిల్ సరసన నటించబోతోంది. ఇలా ఒక సినిమా రిలీజ్ కాకమునుపే మరో సినిమా అవకాశాలు వస్తున్నాయ్.. ఒక్క టాలీవుడ్‌లోనే అనుకుంటే బాలీవుడ్‌లో సైతం బంపరాఫర్లు వచ్చేస్తున్నాయ్.

ఇక అసలు విషయానికొస్తే.. ‘రాజకుమారి మాలా’ అనే సినిమాలో పూజా యువరాణి పాత్రలో నటిస్తోంది. బుధవారం నాడు ఈ సినిమాలో పూజాకు సంబంధించిన రెండు లుక్స్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. కథ విషయానికొస్తే.. 1419లో మొదలైన ఈ కథ 600 సంవత్సరాల తర్వాత 2019లో ముగియనుంది. రాజకుమారి మాలాతో పాటు మరో పాత్రలో పూజా కనిపించనుంది. సెప్టెంబర్ 27న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ వచ్చేస్తుందని.. చూసి తరించండని పూజా పేర్కొంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్ హీరోలుగా నటిస్తున్నారు. పూజాతో పాటు ఈ సినిమాలో కృతి సనన్, కృతి కర్బందా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంటే ముగ్గురు హీరోలకు ముగ్గురు హీరోయిన్లన్న మాట. కాగా పూజాతో పాటు సినిమాలో నటించే నటీనటీమణుల లుక్‌లన్నీ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అయితే వీరి ఫస్ట్‌లుక్స్ అన్నీ ఫన్నీగా ఉండటం గమనార్హం. అంటే సినిమాలో మంచి కామెండీ ఉంటుందన్న మాట. టాలీవుడ్ ఓ వెలుగు వెలిగి టాప్ హీరోయిన్‌ స్థాయికి చేరుకున్న పూజా.. బాలీవుడ్‌లో కూడా రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిద్దాం.

HOUSEFULL 4 Pooja Hegde First Look Release:

HOUSEFULL 4 Pooja Hegde First Look   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ