సెప్టెంబర్-28న టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. 28తో పూరీ 53వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, కుటుంబీకులు వేడుకలు గ్రాండ్ జరపాలని ప్లానింగ్స్ చేసుకుంటున్నారు. అయితే గత నాలుగైదేళ్లుగా పూరీ జరపుకున్న పుట్టిన రోజులు వేరు.. ఇప్పుడు వేరు.. దాదాపు టెంపర్ సినిమా తర్వాత ఇంతవరకూ ఈయన ఖాతాలో హిట్ పడలేదు. ఇప్పుడు ‘ఇస్మార్ శంకర్’ హిట్టవ్వడంతో మంచి ఊపు మీదున్నాడు. ఈ ఏడాది మాత్రం పుట్టిన రోజు గ్రాండ్‌గానే జరపుకుంటారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
‘ఇస్మార్ శంకర్’ ఉత్సాహంతో విజయ్ దేవరకొండతో కలిసి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ పుట్టిన రోజున తన అభిమానులు, విజయ్ అభిమానులకు సర్‌ఫ్రైజ్ ఇవ్వాలని చార్మి, పూరీ భావిస్తున్నారట. ఆ సర్‌ఫ్రైజ్ మరేదో కాదట.. ఫస్ట్ లుక్కేనట. ఒక వేళ లుక్ వీలుకాకపోతే సినిమాకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తారని సమాచారం. కాగా.. విజయ్ ‘వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.. ఇటీవలే ‘అర్జున్‌రెడ్డి’లో మాదిరిగా మాస్ లెవల్‌లో ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.