ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ కొద్దిసేపటి క్రితమే అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన వయస్సు 40 సంవత్సరాలు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో వేణు మాధవ్ కిడ్నీ, కాలేయ సంబంధిత సమస్యతో క్రిటికల్ పొజిషన్ లో జాయిన్ కాగా.. ఈరోజు ఆయన మృతి చెందినట్లుగా ఆసుపత్రి సిబ్బంది తెలియజేసారు. కమెడియన్ గా పలు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న వేణు మాధవ్ గత కొంతకాలంగా ఆరోగ్యపరమైన సమస్యల్తో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. 600 చిత్రాలకు పైగా నటించిన వేణు మాధవ్ కి పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాతో గుర్తింపు దక్కింది. వేణు మాధవ్ మృతికి సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.