Advertisementt

టాలీవుడ్ కుర్ర హీరోలకు రకుల్ ఛాలెంజ్!

Wed 25th Sep 2019 05:12 PM
rakul preet singh,challanges,tollywood young heros,fitness  టాలీవుడ్ కుర్ర హీరోలకు రకుల్ ఛాలెంజ్!
Rakul Preet Challanges To Tollywood Young Heros! టాలీవుడ్ కుర్ర హీరోలకు రకుల్ ఛాలెంజ్!
Advertisement
Ads by CJ

అవును.. టాలీవుడ్ కుర్రహీరోలకు టాప్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్‌సింగ్ ఛాలెంజ్ చేసింది. మీరు అనుకున్నట్లుగా ఇదేదో ఛాలెంజ్ కాదండోయ్ బాబూ.. ఫిట్‌నెస్ చాలెంజ్ మాత్రమే. రకుల్ ఫిట్ నెస్‌కు ఎంత ప్రాధ్యనత ఇస్తుందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. కొత్త సినిమాకు సంతకం చేస్తే చాలు ఇక జిమ్‌లోనే ‘ఖానా, పీనా, సోనా’ అన్నట్లుగా అన్నీ కానిచ్చేస్తుంటుంది. బహుశా ఇలా ఫిట్‌నెస్ మేనేజ్ చేయడంలో రకులే మొదటి వరుసలో ఉంది.

ప్రస్తుతం.. దేశ వ్యాప్తంగా ‘ఫిట్ ఇండియా ఇనిషియేటివ్’ ఫీవర్ పట్టుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి మలైకా అరోరా ‘మేక్ యువర్ మూవ్’ అంటూ రకుల్‌కు ఛాలెంజ్ చేయగా.. ఈ ముద్దుగుమ్మ స్వీకరించింది. ఈ సందర్భంగా యాంటీ గ్రావిటీ పుషప్స్ చేసిన రకుల్ అనంతరం టాలీవుడ్ కుర్ర హీరోలైన మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్‌, రానా దగ్గుబాటిలతో పాటు అజయ్ దేవగన్, మోహన్ శక్తిలకు ఛాలెంజ్ చేసి.. ఫిట్ నెట్ మూవ్స్ చూపించాలని కోరింది. అయితే ఈ భామ చాలెంజ్‌కు ఇంతవరకూ ఎవరూ స్పందించలేదు. మరి ఈ హీరోలందరూ రియాక్ట్ అవుతారో లేకుంటే లైట్ తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.

Rakul Preet Challanges To Tollywood Young Heros!:

Rakul Preet Challanges To Tollywood Young Heros!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ