Advertisementt

‘సీత’ పాత్రకోసం శ్రద్ధా అన్ని కోట్లు అడిగిందా!

Wed 25th Sep 2019 01:01 PM
shraddha kapoor,sita,hrithik roshan,ramayana  ‘సీత’ పాత్రకోసం శ్రద్ధా అన్ని కోట్లు అడిగిందా!
Shraddha Kapoor to play Sita opposite Hrithik Roshan ‘సీత’ పాత్రకోసం శ్రద్ధా అన్ని కోట్లు అడిగిందా!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో ‘రామాయణం’ నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నితేష్‌ తివారీ (దంగల్‌ ఫేం), రవి ఉద్యవర్‌ (మామ్‌ ఫేం) తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఎవరెవర్ని తీసుకోవాలి..? అని పాత్రదారులను వెతికే పనిలో దర్శకనిర్మాతలు బిజిబిజీగా ఉన్నారు. ముఖ్యంగా రాముడు, రావడుణు పాత్రలో ఎవరెవర్ని తీసుకోవాలనే దానిపై ప్రస్తుతం నిర్మాతలు యోచిస్తున్నారు. అయితే.. తాజాగా ఇందుకు ఓ వార్త వైరల్‌గా మారింది.

అల్లువారి రామాయణంకు రాముడు, శ్రీదేవి, రావణుడు దొరికేశారట. ఈ సినిమాలో శ్రీరాముడిగా హృతిక్ రోషన్‌ నటిస్తుండగా.. సీతాదేవిగా దీపికా పదుకొనేను అనుకున్నారట. కొన్ని అనివార్యకారణాల వల్ల దీపిక కుదరదని చెప్పడంతో దర్శక నిర్మాతలు శ్రద్ధా కపూర్‌ను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. అయితే శ్రద్ధా మాత్రం ఈ పాత్రలో నటించడానికి గట్టిగానే డిమాండ్ చేసిందట. ఐదారు కోట్లు కాదండోయ్ ఏకంగా 11 కోట్లు ఇవ్వమని అడిగిందని సమాచారం. అయినప్పటికీ శ్రద్ధాకు అన్ని కోట్లు ఇవ్వడానికి రెడీ అయ్యారట. అయితే ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే దర్శకనిర్మాతలు క్లారిటీ ఇవ్వాల్సిందే మరి.

Shraddha Kapoor to play Sita opposite Hrithik Roshan:

Shraddha Kapoor to play Sita opposite Hrithik Roshan  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ