మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సైరా నరసింహరెడ్డి చిత్రం నిన్న సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. ఎటువంటి కట్స్ లేకుండా ఈ మూవీ UబైA సర్టిఫికేట్ దక్కించుకుంది. ఇక ఈసినిమా రన్ టైంకి వస్తే 164 నిమిషాలుంది. దీంతో ఈసినిమా యొక్క టాక్ సెన్సార్ సభ్యులు ద్వారా బయటకు వచ్చేసింది.
సెన్సార్ సభ్యులు చెబుతున్న వివరాల ప్రకారం.. సైరా సినిమా ఫస్టాఫ్ కంటే సెకెండాఫ్ చాలా బాగుందట. హీరోయిజం సినిమాలో కావాల్సినంత ఉందని చెబుతున్నారు. దేశభక్తిని రగిల్చడం కంటే హీరోయిజం ఎక్కువగా ఉందట. సెకండ్ హాఫ్ మొత్తం చిరు చుట్టూనే తిరుగుతుందని ఇదొక విజువల్ వండర్ అని చెబుతున్నారు. ఇందులో నటించిన అందరు చాలా బాగా చేసారు అని చెబుతున్నారు. అమితాబ్ పాత్ర కూడా చాలా బాగుంటుందని చెబుతున్నారు
ఓవరాల్ గా సినిమా బాగుందని చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమా రిలీజ్ కి ఇంకా వారం పైనే ఉన్నా ఇంత ముందుగా సెన్సార్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈమూవీ 5 భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఎందుకులే ఇబ్బంది అని సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది.