మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. ఈమె ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాటి నుంచి చిన్నపాటి హిట్ కూడా ఖాతాలో వేసుకోలేకపోయింది. ఇక సినిమాల్లో రాణించలేకపోయిన ఈ మెగా డాటర్ ఇక వెండితెరకు టాటా చెప్పేసి వెబ్ సిరీస్‌కు వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు సినిమాల్లో నటించడం లేకపోయే సరికి సోషల్ మీడియాలో యమా యాక్టివ్ అయిపోయింది. ఈ మధ్య ఫొటోలు పెడుతూ హంగామా చేస్తోంది. ఆ ఫొటోలు కూడా సాధారణంగా పెట్టే ఫొటోలు అయితే ఏమోలే అనుకోవచ్చు.. కానీ ఇదిగో పక్కనుండే ఫొటో చూడండి పరిస్థితి ఎలా ఉందో మీకే అర్థమవుతుంది.
ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు, మెగాభిమానులు.. కొంపదీసి మెగాడాటర్ పద్ధతులు పక్కనెట్టేసిందా ఏంటి..? సినిమాల్లో అవకాశాలు రాక.. ఒక వేళ వచ్చినా రాణించలేక ఏం చేయాలో తెలియక ఇలా చేస్తోందా అన్నట్లుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంత హాట్ హాట్ అందాలేంటి నిహారిక అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే బీచ్‌లో రెచ్చిపోయిన నిహారిక.. ఇప్పుడు మరోసారి మోడ్రన్ డ్రస్‌లో అందాలు ఆరబోసింది. అవి కూడా మామూలు అందాలా..? చూడండి ఆ లెక్కేంటో మీకు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాలో బోయ పిల్ల పాత్రలో నిహారిక నటించిన సంగతి తెలిసిందే.