బాహుబలి రిలీజ్ కి ముందు రోజు సాయంత్రం నుండే బాలీవుడ్ లో షోస్ స్టార్ట్ అయిపోయాయి. అక్కడ తెలుగులో రిలీజ్ కి ముందు రోజే ప్రీమియర్లు వేసారు. తెలుగులో మొదటి షోస్ పడేలోపే హిందీలో రివ్యూస్ వచ్చేసాయి. అక్కడ రివ్యూస్ చాలా పాజిటివ్ గా రావడంతో ఈసినిమాపై తెలుగులో మరింత అంచనాలు పెరిగిపోయాయి. అలా మంచి టాక్ తో బాలీవుడ్ లో స్టార్ట్ అయిన బాహుబలి రికార్డ్స్ విషయంలో తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు అదే ట్రిక్ ను సైరా టీం వాడుకోనుంది.
అయితే కేవలం బాలీవుడ్ లోనే కాకుండా హైదరాబాద్ లో కూడా ఒక రోజు ముందే ప్రీమియర్స్ వేయాలని చూస్తున్నారు మేకర్స్. కాకపోతే తెలుగు స్టేట్స్ లో ఒక్క హైదరాబాద్ లోనే ప్రీమియర్స్ వేయాలని చూస్తున్నారు. అందుకే ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లోని అన్ని స్క్రీన్స్‌లో అక్టోబర్ 1 సాయంత్రం సైరా షోస్ కోసం బ్లాక్ చేసినట్టు తెలుస్తుంది.
అదే టైములో హిందీలో ముంబైలో ప్రీమియర్‌ని వేస్తున్నారు ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ వారు. ఒక రోజు ముందే వేయాలంటే కచ్చితంగా సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే సినిమా బాగుందో లేదో ఒక రోజు ముందే తెలిసిపోతే ప్రేక్షకులు దాన్ని బట్టే సినిమాకి వెళ్తుంటారు. ఒక వేళ ప్రీమియర్స్ లో నెగటివ్ టాక్ వస్తే అది కచ్చితంగా ఓపెనింగ్స్ మీద పడుతుంది. అవుట్ ఫుట్ మీద చాలా కాన్ఫిడెంట్ ఉంటే తప్ప ఇలా ప్రీమియర్స్ వెయ్యలేరు. చూద్దాం ట్రైలర్ కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది.