ఏకంగా ముగ్గురు నలుగురుతో రిలేషన్ మైంటైన్ చేసిన శృతి ప్రస్తుతం సింగిల్ గా తన కెరీర్ ని లీడ్ చేస్తుంది. గతంలో ఈమె క్రికెటర్ సురేష్ రైనాతో పాటు నటులు సిద్దార్థ్, విక్రాంత్ మాసేలతో రిలేషన్ మైంటైన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఎవరిని కాదని వేరే దేశపు అబ్బాయి బ్రిటిష్ వ్యక్తితో శ్రుతి రిలేషన్‌షిప్‌లో ఉంది. ఇది అఫీషియల్ గా శృతి చెప్పింది. అయితే ఇతనితో కూడా ఆమె విడిపోయింది. ఈ నేపథ్యంలో శృతి ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో వేర్వేరు కాలాల్లో ఇద్దరితో ప్రేమలో ఉన్నట్లు శ్రుతి వెల్లడించి.. వాటి నుంచి ఎందుకు బయటికి వచ్చేశానో వివరించింది.
‘‘మొదట నేను ఒక అతనితో రిలేషన్ లో ఉన్నప్పుడు ఆ విషయాన్నీ బయటకు చెప్పడానికి భయపడ్డాను. బయటకు చెపితే ఏం అవుతుంది అని భయపడ్డ. కానీ ఆ రిలేషన్ ఎంతో కాలం ఉండలేదు. త్వరగా విడిపోయాం. ఆ తరువాత ఇంకో వ్యక్తితో ప్రేమలో ఉన్నప్పుడు ఈసారి ఎందుకు బయటకు చెప్పకూడదు అనిపించింది. నేనో ప్రత్యేకమైన బంధంలో ఉన్నానని.. బయటకు చెప్పేశాను. నేను అలా ఆ విషయాన్నీ బయటకు చెప్పడంతో చాలామంది మెచ్చుకున్నారు. ఏ బంధం అయినా లైఫ్ లాంగ్ ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం. కానీ అవి కుదరనప్పుడు ఎందుకు కొనసాగించాలి? అందుకే దాన్ని తెంచుకున్నాను. రిలేషన్ స్టార్టింగ్ లో ఎంత హ్యాపీగా ఉండే దాన్నో విడిపోయిన తరువాత కూడా అంతే హ్యాపీగా ఉన్నాను. ప్రస్తుతానికి నేను సింగిల్ గానే ఉన్నాను అని ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం నేను చేసే సినిమాల మీదే’’ అని చెప్పింది.