వాల్మీకిగా కాకుండా గద్దలకొండ గణేష్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్... గద్దలకొండ గణేష్ గా అదరగొట్టేస్తున్నాడు. మిక్స్డ్ టాక్ తోనే భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాడు. వరుణ్ మాస్ లుక్స్, మాస్ యాక్టింగ్ అన్ని మాస్ ప్రేక్షకులకు నచ్చడంతో సినిమా ఫస్ట్ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ కొల్లగొట్టింది. అయితే వీక్ డేస్ లో కూడా సినిమా వీక్ కాకూడదని వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాని తనవంతుగా ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. సినిమా విడుదలైన సాయంత్రానికే చిత్ర బృందంతో కలిసి సక్సెస్ మీట్ లో పాల్గొన్న వరుణ్ తేజ్ సినిమాని ప్రమోట్ చేసే ఏ ఫ్లాట్ ఫామ్ వదలడం లేదు.
బుల్లితెర ప్రేక్షకులు మెచ్చే షోస్ కి హాజరై వాల్మీకిని ప్రమోట్ చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఈటీవీలో ఫేమస్ అయిన జబర్దస్త్ షోకి దర్శకుడు హారిష్ తో కలిసి సందడి చేసిన వరుణ్ తేజ్... శనివారం జి తెలుగులో ప్రసారమైన ప్రదీప్ మాచిరాజు కొంచెం టచ్ లో ఉంటే చెబుతానులో సందడి చేసాడు. అంతేనా ప్రస్తుతం బుల్లితెర మీద ప్రేక్షకులకు బాగా దగ్గరైన బిగ్ బాస్ సీజన్ 3 లో ఆదివారం రాత్రి బిగ్ బాస్ స్టేజ్ మీద నుండి బిగ్ బాస్ హౌమేట్స్ తో కలిసి వాల్మీకి సినిమాని ప్రమోట్ చేసాడు. అలాగే సినిమా ప్రమోషన్స్ కోసం ఇప్పుడు వరుణ్ తేజ్ అండ్ వాల్మీకి యూనిట్ థియేటర్స్ బాట పట్టబోతున్నట్టుగా సమాచారం.