సై రా నరసింహారెడ్డి ఐదు భాషల్లో అక్టోబర్ 2 న విడుదలకాబోతున్న విషయం తెలిసిందే. విడుదలకు కేవలం పది రోజుల టైం మాత్రమే మిగిలి ఉంది. నిన్నగాక మొన్న ట్రైలర్ తో అన్ని భాషల ప్రేక్షకులను ఊపేసిన సై రా ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మరింత హైప్ క్రియేట్ చేయబోతుంది. అయితే నాలుగు భాషల్లో సై రా సినిమాకి ఎదురు లేదు కానీ... బాలీవుడ్ లో మాత్రం సై రాకి చుక్కలు కనబడేలా ఉంది. సై రా ట్రైలర్ తో సినిమా మీద హిందీ లోని క్రేజ్ సంపాదించిన సై రా మీద బాలీవుడ్ లో పాజిటివ్ ట్వీట్స్ ఊతమిచ్చాయి.
కానీ బాలీవుడ్ లో అదే అక్టోబర్ 2 న హ్రితిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ నటించిన వార్ కూడా విడుదలకాబోతుంది. ఆ సినిమాని యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. అయితే వార్ సినిమా ట్రైలర్ కన్నా సై రా సినిమా ట్రైలర్ బావుంది అని హిందీ ప్రేక్షకులు అనేసరికి ఇప్పుడు యశ్ రాజ్ ఫిల్మ్స్ సై రా కి చెక్ పెట్టడానికి రెడీ అయ్యిందనే టాక్ వినబడుతుంది. అదెలా అంటే సై రా సినిమాకి బాలీవుడ్ లో థియేటర్స్ దొరక్కుండా ఎక్కువ మొత్తంలో హ్రితిక్ రోషన్ వార్ కే బ్లాక్ చెయ్యాలని చూస్తుందట. ఒకవేళ అలా కాకపోయినా.. హ్రితిక్ మీదున్న క్రేజ్ బాలీవుడ్ వాళ్ళకి చిరు మీదుండదు. వార్ సినిమాకి తెగిన టికెట్స్ సైరాకి తెగవంటున్నారు.